OGకి మరో సడన్ బ్రేక్.. ఈసారి కారణం పవన్ కాదు!
తాజాగా ఇమ్రాన్ హష్మీ డెంగ్యూ బారినపడినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. ముంబైలో షూటింగ్ సమయంలో ఆయనకు డెంగ్యూ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా, డెంగ్యూ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.;
పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘OG’ సినిమా టాలీవుడ్‌లో భారీ అంచనాలను రేకెత్తిస్తోన్న విషయం తెలిసిందే. సుజీత్ డైరెక్షన్‌లో DVV ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా సెప్టెంబర్ లో విడుదల కానుంది. ముంబై అండర్‌వరల్డ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఒక గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నాడు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ప్రతినాయకుడిగా తెలుగు సినిమాల్లోకి అడుగుపెడుతుండగా, ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది.
అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, సుభలేఖ సుధాకర్ వంటి నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ‘OG’ సినిమా ఇప్పటికే షూటింగ్ ఆలస్యం అయ్యింది. పవన్ కళ్యాణ్, రాజకీయ కారణాల వల్ల ఆటంకాలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అయితే, ఇటీవల పవన్ కళ్యాణ్ షూటింగ్‌లో చేరడంతో పనులు వేగవంతం అయ్యాయి. ముంబైలోని ఆరే కాలనీ, గోరేగావ్‌లో షూటింగ్ జరుగుతున్న తరుణంలో పవన్, ఇమ్రాన్ హష్మీ మధ్య ఫేస్ ఆఫ్ సీన్స్‌ను చిత్రీకరిస్తున్నారు.
థమన్ ఎస్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా టీజర్, గ్లింప్స్‌లు ఇప్పటికే అభిమానుల్లో హైప్‌ను పెంచాయి. అయితే స్పీడ్ ట్రాక్ లో ఉన్న సమయంలో సినిమా షూటింగ్‌కు మరో ఆటంకం ఎదురైంది. తాజాగా ఇమ్రాన్ హష్మీ డెంగ్యూ బారినపడినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. ముంబైలో షూటింగ్ సమయంలో ఆయనకు డెంగ్యూ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా, డెంగ్యూ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
డాక్టర్ల సూచన మేరకు ఆయన విశ్రాంతి తీసుకోవాలని, దాదాపు వారం రోజుల పాటు షూటింగ్‌కు దూరంగా ఉండాలని సలహా ఇచ్చారు. దీంతో ‘OG’ షూటింగ్ తాత్కాలికంగా నిలిచిపోయింది. ఇమ్రాన్ త్వరగా కోలుకోవాలని టీమ్ కోరుకుంటోంది. ఇమ్రాన్ హష్మీ ఈ విషయాన్ని వెంటనే నిర్మాతలకు తెలియజేసి, షూటింగ్‌లో పాల్గొనలేనందుకు చింతను వ్యక్తం చేశాడు. అయితే, టీమ్ ఆయన ఆరోగ్యాన్ని ముందుగా చూసుకోవాలని, పూర్తిగా కోలుకున్న తర్వాతే షూటింగ్‌లో చేరాలని సూచించింది.
ఇమ్రాన్ ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు, ఈ సమయంలో షూటింగ్ షెడ్యూల్‌ను మార్చి, ఇతర సన్నివేశాలను చిత్రీకరించే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తంగా, ‘OG’ సినిమా మరోసారి ఆటంకం ఎదుర్కొంది, కానీ ఈసారి కారణం పవన్ కళ్యాణ్ కాదు. ఇమ్రాన్ హష్మీ త్వరగా కోలుకుని షూటింగ్‌లో చేరితే, సెప్టెంబర్ 25న సినిమా రిలీజ్‌కు ఎలాంటి ఆటంకం ఉండదు. ఈ సినిమా పవన్ కళ్యాణ్, ఇమ్రాన్ హష్మీ కాంబోతో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.