అదే జరిగితే ఓజిని ఆపడం ఎవరి వల్లా కాదు!
టాలీవుడ్ లో గత కొన్ని సినిమాలుగా ఏ సినిమాకీ లేని హైప్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ఓజి సినిమాకు వచ్చింది.;
టాలీవుడ్ లో గత కొన్ని సినిమాలుగా ఏ సినిమాకీ లేని హైప్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ఓజి సినిమాకు వచ్చింది. సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సినిమా అని ఏ ముహూర్తాన అనౌన్స్‌మెంట్ వచ్చిందో కానీ అప్పట్నుంచే ఆ సినిమాపై అందరికీ భారీగా అంచనాలు పెరిగిపోయాయి. అసలే పవన్ ప్రాపర్ కమర్షియల్ మూవీ చేసి చాలా కాలమవుతుండగా, ఇప్పుడు ఓజి అలానే తెరకెక్కడం ఫ్యాన్స్ కు మొదటి నుంచి మంచి కిక్కిస్తూ వచ్చింది.
కాస్త ఆలస్యంగా రిలీజైన ఓజి ట్రైలర్
సెప్టెంబర్ 25న ఓజి రిలీజ్ కానుంది. విడుదల దగ్గర పడుతున్న నేపథ్యంలో రీసెంట్ గా మేకర్స్ ఓజి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. చెప్పిన టైమ్ కు ఓజి ట్రైలర్ రిలీజ్ కాకపోవడంతో అసలు ట్రైలర్ లేకుండా నేరుగా థియేటర్లో సినిమా చూడటమే అని అందరూ ఫిక్సై పోయి ట్రైలర్ పై ఆశలు వదులుకున్న టైమ్ లో మేకర్స్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
ఓజి ట్రైలర్ ను డీకోడ్ చేస్తున్న నెటిజన్లు
ట్రైలర్ రిలీజ్ చేయడం ఆలస్యం.. ఫ్యాన్స్ దాన్ని ఫ్రేమ్స్ గా విడదీసి విశ్లేషించి, రకరకాల యాంగిల్స్ లో చూసి సినిమాలోని సీక్రెట్స్ ను బయటపెట్టే ప్రయత్నం చేశారు. నెటిజన్ల విశ్లేషణలో భాగంగా వారికో హింట్ దొరికింది. అదే వాజి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ అనే బోర్డ్. షిప్ యార్డ్ కంటైనర్ మీద ఈ బోర్డు చూసి ఓజికి, సాహో సినిమాకీ లింక్ ఉందని అంటుంటే, ఇంకొందరు ఏకంగా స్టోరీలు అల్లేస్తున్నారు.
మరికొందరైతే ఇంకో అడుగు ముందుకేసి ఈ సినిమాలో ప్రభాస్ క్యామియో కూడా ఉంటుందని వార్తలు పుట్టిస్తున్నారు. అయితే మొదట్నుంచి కూడా సుజిత్ గత సినిమా సాహోకీ, ఓజితో లింక్ ఉందని, సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే సుజిత్ ఓజిని తెరకెక్కించారని వార్తలు వినిపించాయి. అయిత్ ఇన్‌సైడ్ టాక్ ప్రకారం, ఓజికి, సాహోకి లింక్ ఉందనే తెలుస్తోంది. కాకపోతే ఓజిలో ప్రభాస్ కానీ ఆ సినిమాలోని ఏ పాత్రా క్యామియో కానీ ఉండదని అంటున్నారు. ఒకవేళ ఈ వార్త నిజమై, సుజిత్ ఓజి, సాహో మధ్య లింక్ పెడితే మాత్రం ఓజి కలెక్షన్ల పరంపరను ఆపడం కష్టమే అవుతుంది. సెప్టెంబర్ 24వ తేదీ రాత్రి 9 గంటల నుంచే ఓజికి ప్రీమియర్లు వేయడానికి మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్న విషయం తెలిసిందే.