పవన్ ఓజీ.. చాలా మంది ట్రై చేసినట్లున్నారే!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో నటించిన ఓజీ మూవీ రిలీజ్ కు రంగం సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. మరో నాలుగు రోజుల్లో గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.;
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో నటించిన ఓజీ మూవీ రిలీజ్ కు రంగం సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. మరో నాలుగు రోజుల్లో గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. దసరా కానుకగా సెప్టెంబర్ 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా సినిమాను పెద్ద ఎత్తున విడుదల చేయనున్నారు.
ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ చేయగా.. ఓ రేంజ్ లో ప్రీ సేల్ జరుగుతోంది. ట్రైలర్ రిలీజ్ అయ్యాక మరింత జోష్ తో జరగనుందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. ముఖ్యంగా సినిమాపై హైప్ ఇలా అలా లేదు. సింపుల్ గా చెప్పాలంటే.. ప్రతి ఒక్కరూ.. అటు అభిమానులు.. ఇటు సినీ ప్రియులు ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
అనేక మంది సెలబ్రిటీలు కూడా ఎదురుచూస్తున్నారు. అలా ఉంది ఓజీ సినిమాపై క్రేజ్. అయితే దాన్ని యూజ్ చేసుకోవడానికి చాలా మంది ట్రై చేసినట్లు తెలుస్తోంది. సాధారణంగా అనేక సినిమాల ఇంటర్వెల్ టైమ్ లో వివిధ చిత్రాల గ్లింప్సెస్ ప్లే చేస్తుంటారు. ఇప్పటికే చాలా సార్లు ఇలా జరిగిన విషయం తెలిసిందే.
అయితే ఓజీ మూవీతోపాటు తమ సినిమాల గ్లింప్సెస్ అటాచ్ చేసే ప్లే చేయాలని చాలా మంది మేకర్స్ కోరుతున్నారట. ఇప్పటికే వరకు ఓజీ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ను 20 చిత్రాల మేకర్స్ సంప్రదించారని తెలుస్తోంది. సినిమా ఇంటర్వెల్ టైమ్ లో ప్లే చేస్తే.. పెద్ద ఎత్తున పేమెంట్ కూడా చెల్లిస్తామని చెప్పారట.
ఆ 20 సినిమాల మేకర్స్ లో వేరే లాంగ్వేజెస్ చిత్రాలు కూడా ఉండడం విశేషం. ఏదేమైనా ఓజీ క్రేజ్ ను యూజ్ చేసుకోవడానికి చాలా మంది బాగా ట్రై చేశారు. కానీ మూవీ మేకర్స్ అందుకు ఒప్పుకోలేదని సమాచారం. పెద్ద ఎత్తున పేమెంట్ ఇస్తామని చెప్పినా అందరికీ పచ్చ జెండా ఊపలేదని తెలుస్తోంది. లేదు కుదరదని చెప్పేశారట.
అయితే ఇప్పుడు మరో టాక్ కూడా వినిపిస్తోంది. వేరే చిత్రాల మేకర్స్ కు ఛాన్స్ ఇవ్వని నిర్మాత దానయ్య.. తన కొడుకు డెబ్యూ మూవీ గ్లింప్స్ ను ప్లే చేస్తారని సమాచారం. దానయ్య కొడుకు కళ్యాణ్ లీడ్ రోల్ లో డెబ్యూ మూవీ అధీర అనౌన్స్మెంట్ ఇప్పటికే వచ్చింది. అప్పట్లో గ్లింప్స్ కూడా రిలీజైంది. కానీ ప్రాజెక్టు ముందుకు సాగడం లేదు. ఇప్పుడు అధీర గ్లింప్స్ ను ఓజీ ఇంటర్వెల్ టైమ్ లో ప్లే చేయనున్నారని వినికిడి.