'ఓజి' బర్త్ డే గ్లింప్స్.. ఇది లవ్ ఓమీ!
ఇప్పటికే పోస్టర్లు, గ్లింప్స్, పాటలు సినిమాపై హైప్‌ను రెట్టింపు చేశాయి. పవన్ బర్త్‌డే స్పెషల్‌గా మేకర్స్ ఇంకో పెద్ద ట్రీట్ అందించారు.;
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యువ దర్శకుడు సుజీత్ కాంబినేషన్‌లో వస్తున్న మాస్ యాక్షన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ఓజి పట్ల అభిమానుల్లో అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ పాన్ ఇండియా లెవెల్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే పోస్టర్లు, గ్లింప్స్, పాటలు సినిమాపై హైప్‌ను రెట్టింపు చేశాయి. పవన్ బర్త్‌డే స్పెషల్‌గా మేకర్స్ ఇంకో పెద్ద ట్రీట్ అందించారు.
సాధారణంగా ఇలాంటి స్పెషల్ గ్లింప్స్ అన్నీ హీరో సైడ్ నుంచి రావడం మనం చూసే అంశం. కానీ ఈసారి ఓజి మేకర్స్ కొంచెం డిఫరెంట్‌గా ప్లాన్ చేశారు. విలన్ పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ సైడ్ నుంచి గ్లింప్స్‌ను రిలీజ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ క్రియేటివ్ మూవ్ ఫ్యాన్స్‌కే కాదు, సినిమా లుక్స్‌పై ఆసక్తి చూపుతున్న సినీప్రియులందరినీ ఆకట్టుకుంది.
ఇమ్రాన్ హష్మీ స్క్రీన్ ప్రెజెన్స్ ఈ గ్లింప్స్‌లో మాస్ అట్రాక్షన్‌గా నిలిచింది. పవన్‌కు సరితూగే స్ట్రాంగ్ విలన్‌గా ఆయనను చూపించడంలో దర్శకుడు సుజీత్ విజయం సాధించేలా ఉన్నాడు. లుక్స్, బాడీ లాంగ్వేజ్, బిల్డప్ సీన్స్ అన్నీ కలిపి ఇమ్రాన్ నిజంగా పర్ఫెక్ట్ విలన్ మెటీరియల్ అని చెప్పించేశాయి. లాస్ట్‌లో పవన్ తో కనిపించిన సీక్వెన్స్ మాత్రం మ్యాడ్ లెవెల్ ట్రీట్‌గా నిలిచింది. ఫ్యాన్స్ ఇప్పటికే ఈ లుక్‌పై సోషల్ మీడియాలో ఫుల్ ఎక్సైట్మెంట్ వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ గ్లింప్స్‌లో మరో హీరో థమన్. ఆయన అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మొత్తం వీడియోకి కొత్త లెవెల్ ఇచ్చింది. సౌండ్ ఎఫెక్ట్, మ్యూజిక్ టెంపో, ఎలివేషన్ సౌండ్స్ అన్నీ వేరే ఫీల్ క్రియేట్ చేశాయి. ఇప్పటివరకు థమన్ ఇచ్చిన స్కోర్స్‌తో పోలిస్తే ఇది ఫ్రెష్‌గా, డిఫరెంట్‌గా అనిపిస్తుందని సినీ వర్గాలు కామెంట్ చేస్తున్నాయి.
ఓజి లో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. బాలీవుడ్ విలన్ ఇమ్రాన్ హష్మీ ఎంట్రీతో సినిమాకు పాన్ ఇండియా హైప్ డబుల్ అయింది. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో సాగుతున్న ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని టీమ్ చెబుతోంది. సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానున్న ఓజి ఓవర్సీస్‌లో కూడా రికార్డు స్థాయిలో రిలీజ్ అవుతోంది.