వీరమల్లు తో సంబంధం లేకుండా 'ఓజీ'...!

వీరమల్లుతో పాటు వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చిన ఓజీ సినిమాను ఎట్టకేలకు పవన్‌ కళ్యాణ్ పూర్తి చేసిన విషయం తెల్సిందే.;

Update: 2025-08-01 09:57 GMT

పవన్‌ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన 'హరిహర వీరమల్లు' సినిమా విడుదలైంది. గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన వీరమల్లు సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. వీఎఫ్‌ఎక్స్‌ వర్క్ విషయంలో చాలా మంది విమర్శలు చేశారు. కథ, కథనం విషయంలో పాజిటివ్‌ టాక్‌ దక్కినా ఓవరాల్‌గా సినిమాకు రావాల్సిన రెవిన్యూ రాలేదని చెప్పక తప్పదు. ముందు ముందు కూడా సినిమా బ్రేక్‌ ఈవెన్‌ వరకు వెళ్తుందా అంటే అనుమానమే అంటూ బాక్సాఫీస్‌ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎంత మేరకు బయ్యర్లు నష్టపోతారు అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్‌ చేయాల్సి ఉంటుంది. పవన్‌ కళ్యాణ్ మీడియా ముందుకు వచ్చి ప్రచారం చేయడం వల్ల ఆ స్థాయి ఓపెనింగ్స్ నమోదు అయ్యాయి. ఆయన రాకుంటే నష్టం ఊహకు సైతం అందకపోయేది అంటూ కొందరు అంటున్నారు. మొత్తానికి వీరమల్లు సినిమా పవన్‌ ఫ్యాన్స్‌కి చేదు అనుభవంగా మిగిలింది.

ఓజీ కోసం పవన్‌ ఫ్యాన్స్‌ ఎదురు చూపులు

క్రిష్ సినిమా నుంచి తప్పుకున్న సమయంలోనే చాలా మంది వీరమల్లు సినిమా పై ఆశలు వదిలేసుకున్నారు. అయినా పవన్‌ చేసిన వ్యాఖ్యల కారణంగా సినిమాపై ఆసక్తి పెరిగింది. ఊహించిన ఫలితమే కనుక చాలా మంది వీరమల్లు సినిమా గురించి నిరుత్సాహం వ్యక్తం చేయడం లేదు. వీరమల్లు సినిమా ఫలితంతో సంబంధం లేకుండా పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు 'ఓజీ' సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఓజీ సినిమా షూటింగ్‌ ప్రారంభం అయింది మొదలు అంచనాలు భారీగా ఉన్నాయి. చాలా మంది వీరమల్లు సినిమాను వదిలేసి పవన్‌ ఓజీ సినిమాను పూర్తి చేయాలని డిమాండ్‌ చేసిన సందర్భాలు ఉన్నాయి. సాహో వంటి స్టైలిష్ యాక్షన్‌ మూవీని చేసిన సుజీత్‌ దర్శకత్వంలో ఓజీ రూపొందుతున్న కారణంగా అంచనాలు మొదటి నుంచి భారీగా ఉన్నాయి.

ఆగస్టు 2న ఓజీ నుంచి ఫస్ట్‌ సింగిల్‌

వీరమల్లుతో పాటు వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చిన ఓజీ సినిమాను ఎట్టకేలకు పవన్‌ కళ్యాణ్ పూర్తి చేసిన విషయం తెల్సిందే. సుజీత్‌ చాలా ఉత్సాహంగా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ చేస్తున్నాడు. షూటింగ్‌ పూర్తి అయిన ఓజీ సినిమాను సెప్టెంబర్‌ 25న విడుదల చేయబోతున్నారు. గత కొన్ని నెలలుగా ఈ సినిమా గురించిన ప్రచారం జరుగుతున్న విషయం తెల్సిందే. దాంతో విడుదల సమయం దగ్గర పడుతున్నా కొద్ది అభిమానుల్లో ఉత్సాహం పెరుగుతూనే ఉంది. ఓజీ సినిమా ప్రమోషన్‌ను మొదలు పెట్టబోతున్నట్లు దర్శకుడు సుజీత్‌ నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది. ఆగస్టు 2న ఓజీ నుంచి మొదటి సింగిల్‌ రాబోతున్నట్లు ప్రకటన వచ్చింది. తమన్‌ ఈ పాటను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు.

పవన్‌ కి జోడీగా ప్రియాంక మోహన్‌

పవన్‌ కళ్యాణ్ నుంచి సినిమా వస్తుందంటే అభిమానుల్లోనే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్లోనూ అంచనాలు భారీగా ఉంటాయి. ఇటీవలే వీరమల్లు వచ్చి నిరాశ పరచినా కూడా దానితో ఏమాత్రం సంబంధం లేకుండా ఓజీ సినిమా కోసం అభిమానులు అదే ఉత్సాహంగా ఎదురు చూడటం విశేషం. సాధారణంగా మరే హీరో సినిమా అయినా ఇంత తక్కువ గ్యాప్‌లో వస్తే ఖచ్చితంగా ఫ్లాప్‌ ప్రభావం ఉంటుంది. కానీ పవన్‌ కళ్యాణ్ వరుసగా మూడు నాలుగు సినిమాలు ఫ్లాప్‌ అయినా తర్వాత వచ్చే సినిమాకు ప్రేక్షకులు, అభిమానులు అదే ఉత్సాహంతో ఎదురు చూడటం మనం చూస్తూ ఉంటాం.

పవన్‌ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఓజీ సినిమా మినిమం పాజిటివ్‌ టాక్‌ దక్కించుకున్నా వందల కోట్ల వసూళ్లు నమోదు కావడం ఖాయం అంటూ బాక్సాఫీస్‌ వర్గాల వారు అంటున్నారు. సుజీత్‌ సినిమా కోసం హిందీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. సాహో అక్కడ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. అందుకే ఓజీ కోసం హిందీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రియాంక అరుల్‌ మోహన్‌ హీరోయిన్‌గా నటించగా, బాలీవుడ్‌ స్టార్‌ ఇమ్రాన్ ఖాన్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

Tags:    

Similar News