OG కన్సర్ట్.. నిర్వాహకులు ఇలా చేశారేంటి?

అయితే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఓజీ మూవీ దసరా కానుకగా ఈ నెల 25న థియేటర్లలోకి రానుంది.;

Update: 2025-09-22 05:33 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా యంగ్ డైరెక్టర్ సుజీత్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఓజీ (They Call Him OG). డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య, కల్యాణ్‌ దాసరి నిర్మించిన ఆ సినిమాలో ప్రియాంక మోహన్‌ హీరోయిన్ గా యాక్ట్ చేశారు. బాలీవుడ్ స్టార్ యాక్టర్ ఇమ్రాన్‌ హష్మీ విలన్ గా నటించారు.

అయితే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఓజీ మూవీ దసరా కానుకగా ఈ నెల 25న థియేటర్లలోకి రానుంది. దీంతో మేకర్స్ ఆదివారం రాత్రి హైదరాబాద్‌ ఎల్బీ స్డేడియంలో ఓజీ కన్సర్ట్ నిర్వహించారు. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. తన పవర్ ఫుల్ స్పీచ్ తో అదరగొట్టారు. అందరిలో జోష్ నింపారు.

కానీ అభిమానులు మాత్రం నిరాశపడ్డారు. ఎందుకంటే ఈవెంట్ లో చాలా ఉంటాయని ఎక్పెక్ట్ చేశారు. అందుకే సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చారు. ముఖ్యంగా ఈవెంట్ నిర్వహణపై పెదవి విరిచారు. కార్యక్రమానికి చెందిన బాధ్యతలు చూసుకున్న నిర్వాహకులు.. అన్ని విధాలుగా విఫలమయ్యారంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.

సరైన ప్రణాళికతో నిర్వహించలేదని చెబుతున్నారు. ఎందుకంటే హైదరాబాద్ లో ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కుండపోత వర్షం కురిసింది. వర్షపు నీటితో రోడ్లన్నీ జలమయమయ్యాయి. అయితే వాతావరణం మాత్రం సాయంత్రం నుంచి మేఘావృతంతో ఉన్నా.. నిర్వాహకులు ఈవెంట్ కోసం బహిరంగంగా వేదికను ఎంచుకున్న విషయం తెలిసిందే.

క్లోజ్డ్ ప్లేస్ లో నిర్వహించి ఉంటే.. సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉండేదని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. అది పక్కన పెడితే.. ఈవెంట్ చాలా ఆలస్యంగా రాత్రి 8 గంటల తర్వాత ప్రారంభమైంది. అది కూడా భారీ వర్షంలో జరిగింది. ఒకవేళ కాస్త ముందు ప్రారంభమై ఉంటే ఫ్యాన్స్.. సమయం విషయంలో ఇబ్బంది పడకుండా జరిగేది.

అయితే వర్షంలోనే అభిమానులంతా నిల్చుని ఉన్నారు. మధ్యలో ఓసారి వాన వల్ల కార్యక్రమానికి ఆటంకం కూడా ఎదురైంది. వరుణుడి ప్రతాపం వల్ల క్యాస్టింగ్ అంతా అనుకున్నట్లు మాట్లాడలేకపోయారు. లేకుంటే అంతా అనుభవాలను పంచుకునే అవకాశం కచ్చితంగా ఉంది. పవన్ కూడా ఇంకా మాట్లాడేవారని అంతా భావిస్తున్నారు. ఏదేమైనా చాలా ఆశలతో వచ్చిన అభిమానులు.. నిరాశ చెందారని చెప్పాలి.

Tags:    

Similar News