OG కలెక్షన్స్.. టోటల్ లెక్క చూపించిన తమన్!
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన డే వన్ వరల్డ్‌వైడ్ కలెక్షన్స్‌పై సంగీత దర్శకుడు తమన్ క్లారిటీ ఇచ్చారు.;
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా విడుదలతో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ లో ఒక పాజిటివ్ హైప్ నెలకొంది. థియేటర్ల వద్ద ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా కోసం ఏర్పడిన హంగామా వేరే లెవెల్‌లో సాగింది. రిలీజ్ డే మొత్తం సోషల్ మీడియాలోనూ ఓజీ హ్యాష్‌ట్యాగ్స్ మాత్రమే కనిపించాయి.
టాక్ మిక్స్ డ్ గా ఉన్నప్పటికీ ఫ్యాన్స్ నుంచి మాత్రం పాజిటివ్ వైబ్ కనిపిస్తోంది. మొదటి షో దగ్గర నుంచి ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. పవన్ ఎంట్రీ సీన్లు, ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ వరకు ఫ్యాన్స్ నుంచి ఊహించని రియాక్షన్లు వచ్చాయి. మిక్స్ టాక్ వచ్చినా కూడా ఫ్యాన్స్ దానిని పక్కన పెట్టి హీరో స్టైల్, యాక్షన్ మాస్ సీన్లను పూర్తిగా ఎంజాయ్ చేశారు. ఈ ఉత్సాహం వసూళ్లలోనూ ప్రత్యక్షంగా కనిపించింది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన డే వన్ వరల్డ్‌వైడ్ కలెక్షన్స్‌పై సంగీత దర్శకుడు తమన్ క్లారిటీ ఇచ్చారు. ఆయన ట్వీట్ చేస్తూ ఓజీ మొదటి రోజే 154 కోట్ల గ్రాస్ దాటిందని స్పష్టం చేశారు. "జస్ట్ ఇది స్టార్ట్ మాత్రమే.. పవర్ స్టార్ ర్యాంపేజ్" అని తమన్ చెప్పడం ఫ్యాన్స్‌లో మరోసారి ఎనర్జీ పెంచింది. దీనితో సోషల్ మీడియాలో ఈ అప్‌డేట్ రికార్డుల్లా పాకింది.
గతంలో బాహుబలి 2, ఆర్ఆర్ఆర్, పుష్ప 2, కల్కి 2898 ఏడీ లాంటి సినిమాలు డే వన్ వరల్డ్‌వైడ్‌లో భారీ వసూళ్లు సాధించాయి. ఇప్పుడు అదే జాబితాలో ఓజీ కూడా చేరిపోవడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా నైజాం, సీడెడ్, ఆంధ్ర ప్రాంతాల్లో వచ్చిన రెస్పాన్స్ వసూళ్లకు పెద్ద బలంగా మారింది. అదేవిధంగా ఓవర్సీస్‌లోనూ ఈ సినిమా మాస్ మేనియా క్రియేట్ చేసింది.
ప్రస్తుతం ట్రేడ్ వర్గాలు చెబుతున్న అంచనాల ప్రకారం, తెలుగు రాష్ట్రాల్లోనే 62 కోట్లకు పైగా షేర్ వచ్చింది. ఓవర్సీస్‌తో కలిపి గ్రాస్ 154 కోట్లకు చేరుకోవడం పవన్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో మరోసారి నిరూపించింది. ఇది కేవలం మొదటి రోజు లెక్క మాత్రమే కావడంతో, రాబోయే సెలవు రోజుల్లో ఇంకా వసూళ్లు ఏ స్థాయిలో పెరుగుతాయో చూడాలి. మొత్తం మీద, పవన్ పవర్ మళ్లీ ఒకసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. టాక్ ఎలా ఉన్నా, ఫ్యాన్స్ ఫుల్ హంగామా చేస్తున్నారు.