పవన్ OGకి అన్నీ అనుకూలమే.. క్లిక్ అయితే కాసుల వర్షమే..

అయితే ఓజీ మూవీపై ఆడియన్స్ లో మామూలు హైప్ లేదు. నెవ్వర్ బిఫోర్ అనేలా ఇప్పటికే బజ్ క్రియేట్ అయ్యి ఉంది. పవన్ కెరీర్ లో ఇంతలా ఉండడం తొలిసారేమో.;

Update: 2025-09-11 04:46 GMT

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇప్పుడు ఓజీ మూవీతో మరికొద్ది రోజుల్లో థియేటర్స్ లోకి రాబోతున్న విషయం తెలిసిందే. ముంబై బ్యాక్ డ్రాప్ తో గ్యాంగ్ స్టర్ డ్రామాగా సుజిత్ తెరకెక్కిస్తున్న ఆ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖ నటుడు ఇమ్రాన్ హష్మీ కీలక పాత్ర పోషిస్తున్నారు.

శ్రియా రెడ్డి, సిరి లెళ్ల, అర్జున్ దాస్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఆ మూవీ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న సినిమా.. దసరా పండుగ సందర్భంగా థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు. సెప్టెంబర్ 25వ తేదీన పెద్ద ఎత్తున విడుదల చేయనున్నారు.

అయితే ఓజీ మూవీపై ఆడియన్స్ లో మామూలు హైప్ లేదు. నెవ్వర్ బిఫోర్ అనేలా ఇప్పటికే బజ్ క్రియేట్ అయ్యి ఉంది. పవన్ కెరీర్ లో ఇంతలా ఉండడం తొలిసారేమో. అనౌన్స్మెంట్ నుంచే సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొనగా.. వాటిని మేకర్స్ ఇంకా పెంచారు. ఇప్పుడు వేరే లెవెల్ అంచనాల మధ్య సినిమా రిలీజ్ చేయనున్నారు.

అదే సమయంలో ఓజీ మూవీకి పండుగ అడ్వాంటేజ్ ఫుల్ గా ఉందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు దసరా సెలవులు ప్రకటించాయి. సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు తెలంగాణలో పాఠశాలలకు సెలవులు కాగా.. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5 వరకు కళాశాలలు మూతపడనున్నాయి.

ఏపీ విషయానికొస్తే.. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5 వరకు కళాశాలకు హాలీడేస్ అనౌన్స్ చేసింది. ఇప్పుడు సెప్టెంబర్ 25వ తేదీన ఓజీ మూవీ రిలీజ్ అవుతుండగా.. కంప్లీట్ ఒక పూర్తి వారం బెనిఫిట్ కచ్చితంగా సినిమాకు దక్కుతుంది.

ఫెస్టివల్ మూడ్ లో సినిమాను థియేటర్స్ లో చూసేందుకు అంతా ఇష్టపడతారు. అది కూడా పవన్ మూవీ కాబట్టి.. కచ్చితంగా థియేటర్స్ కు వెళ్తారు. దీంతో దసరా సీజన్ ను ఓజీ సినిమా సరైన విధంగా ఉపయోగించుకునేలా కనిపిస్తోంది. సినిమాకు కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా చాలు.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురుస్తుంది. ఎన్నో రికార్డులు కూడా బద్దలవుతాయి.. క్రియేట్ అవుతాయి.. మరేం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News