తెలుగులో పవన్ OG.. ఆ లిస్టులో ప్లేస్ ఎంతంటే?

టాలీవుడ్ పవర్‌ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఓజీ. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ఆ యాక్షన్ ఎంటర్‌టైనర్‌‌ ను ప్రముఖ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య, కళ్యాణ్ నిర్మించారు.;

Update: 2025-09-28 19:49 GMT

టాలీవుడ్ పవర్‌ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఓజీ. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ఆ యాక్షన్ ఎంటర్‌టైనర్‌‌ ను ప్రముఖ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య, కళ్యాణ్ నిర్మించారు. సెప్టెంబర్ 24వ తేదీన ప్రీమియర్స్ వేయగా.. సెప్టెంబర్ 25వ తేదీన వరల్డ్ వైడ్ గా సినిమాను పెద్ద ఎత్తున రిలీజ్ చేశారు.

అయితే నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్ ఖర్చులు, ప్రచార కార్యక్రమాలతో కలిపి ఓజీని రూ.250 కోట్ల బడ్జెట్ తో నిర్మించారని తెలుస్తోంది. అదే సమయంలో వరల్డ్ వైడ్ గా రూ.193.5 కోట్ల ప్రీ రిలీజ్ జరిగిందని కూడా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపి రూ.174 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా ఫిక్స్ చేసినట్లు టాక్.

ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ఓజీ మూవీ.. మూడు రోజులకు గాను రూ.110 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించినట్లు తెలుస్తోంది. సగానికి పైగా ఇప్పటికే రికవరీ చేసినట్లు సమాచారం. అయితే మూడో రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఓజీ మూవీ.. రూ.12.30 కోట్ల షేర్ రాబట్టిందని ఇప్పుడు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

తద్వారా ఇటీవల కాలంలో రిలీజ్ అయిన పెద్ద సినిమాల మూడో రోజు తెలుగు రాష్ట్రాల షేర్ వసూళ్లు లిస్ట్ లో ఆరో స్థానంలో నిలిచింది ఓజీ మూవీ. ఆ జాబితాలో తొలి స్థానంలో పాన్ ఇండియా ప్రభాస్ సలార్ మూవీ ఉండగా, రెండో స్థానంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్ చిత్రం పుష్ప-2 ఉంది. మరి ఆ జాబితా వసూళ్లతో సహా మీకోసం.

సలార్ - రూ.22.30 కోట్లు

పుష్ప 2 - రూ.21.60 కోట్లు

కల్కి 2898 ఏడీ- రూ.19.78 కోట్లు

దేవర - రూ.19.11 కోట్లు

ఆదిపురుష్ - రూ.17 కోట్లు

ఓజీ - రూ.12.30 కోట్లు

అయితే తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ పూర్తవ్వాలంటే ఓజీ మూవీ.. ఇంకా రూ.50 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను కలెక్ట్ చేయాలని తెలుస్తోంది. ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ రూ.80 కోట్లకు, సీడెడ్‌ రూ.22 కోట్లకు, నైజాం రూ.55 కోట్లకు మేకర్స్ సేల్ చేసినట్లు సమాచారం. మొత్తం తెలుగు రాష్ట్రాల్లో రూ.157 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. మరి బ్రేక్ ఈవెన్ ఎప్పుడు పూర్తి చేసుకుంటుందో వేచి చూడాలి.

Tags:    

Similar News