ఇమ్రాన్ తో యాక్టింగ్.. అదో గ్రేటెస్ట్ థింగ్: పవన్ కళ్యాణ్

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో రెండు రోజుల్లో ఓజీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.;

Update: 2025-09-22 05:12 GMT

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో రెండు రోజుల్లో ఓజీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గా థియేటర్స్ లో దసరా కానుకగా సెప్టెంబర్ 25వ తేదీ నుంచి సందడి చేయనున్న ఆ సినిమాలో బాలీవుడ్ ప్రముఖ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ గా కనిపించనున్నారు.

ఇప్పటికే టాలీవుడ్ లో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న ఆయన.. ఇప్పుడు ఓజీతో తెలుగులో డెబ్యూ ఇస్తున్నారు. అందులోనూ పవన్‌ కల్యాణ్‌ సినిమాతో ఎంట్రీ ఇస్తుండటం పట్ల చాలా ఎక్జయిటింగ్‌ గా కనిపిస్తున్నారు. రీసెంట్ గా హైదరాబాద్ లో మేకర్స్ ఏర్పాటు చేసిన ఓజీ కన్సర్ట్ కు హాజరై.. స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.

అయితే వేదికపై ఇమ్రాన్ హష్మీని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇమ్రాన్ ఆల్ టైమ్ బిగ్గెస్ట్ రొమాంటిక్ సాంగ్ ఝలక్ దిఖ్ లా జా గురించి ప్రస్తావించారు. ఇమ్రాన్ తో నటించే గొప్ప అవకాశం వచ్చిందని పవన్ తెలిపారు. ఝలక్ దిఖ్ లా జా అంటూ ఉర్రూతలూగించిన ఆయనతో యాక్ట్ చేయడం సంతోషంగా ఉందని తెలిపారు.

ఇమ్రాన్ బ్రిలియంట్ పర్ఫార్మర్ అంటూ కొనియాడారు. అదే సమయంలో పవన్ కామెంట్స్ సమయంలో ఆయన చాలా హ్యాపీ మోడ్ లో కనిపించారు. ఇప్పుడు పవన్ కామెంట్స్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇమ్రాన్ హష్మీ బ్లాక్ కలర్ గ్రాండ్ ఔట్ ఫిట్ లో కనిపించి ఫిదా చేశారని చెప్పాలి.

అయితే ఇప్పటికే ఓ ఇంటర్వ్యూలో ఇమ్రాన్.. సినిమా కోసం మాట్లాడారు. మూవీ కోసం మేకర్స్ తనను సంప్రదించినప్పుడు చాలా థ్రిల్లింగ్‌ గా ఫీలయ్యానని తెలిపారు. తెలుగు ఇండస్ట్రీ ఎంట్రీ కోసం లెజెండరీ పవన్‌ తో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం కంటే ఉత్తమ విషయం ఇంకేం ఉంటుందని తెలిపారు.

పవన్‌, డైరెక్టర్‌ సుజిత్‌ తో పనిచేయడం అద్భుతమైన అనుభవమని చెప్పారు. తన లుక్‌, డైలాగ్‌ డెలివరీ నుంచి పూర్తి క్యారెక్టరైజేషన్‌ వరకు ప్రతీ విషయం ఇంప్రెస్‌ చేశారని తెలిపారు. అందుకే సినిమాలో భాగం కావడానికి ఎక్జయిట్‌ అయ్యానంటూ చెప్పుకొచ్చారు. అయితే సుజిత్ దర్శకత్వం వహించిన ఓజీని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్‌ పై దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు.

Tags:    

Similar News