బర్త్ డే ట్రీట్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
ఓజి తో పాటూ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.;
ఇండస్ట్రీలో ఎవరైనా స్టార్ బర్త్ డే వస్తుందంటే ఫ్యాన్స్ వారి సినిమాల అప్డేట్స్ కోసం వెయిట్ చేయడం కామన్. సెప్టెంబర్ 2వ తేదీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే. దీంతో ఫ్యాన్స్ ఆయన బర్త్ డే సందర్భంగా రాబోయే అప్డేట్స్ కోసం ఎంతో ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. రీసెంట్ గా హరిహర వీరమల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన పవన్ ఆ సినిమాతో నిరాశనే అందుకున్నారు.
పవన్ ఫ్యాన్స్ ఆశలన్నీ ఓజిపైనే!
దీంతో పవన్ ఫ్యాన్స్ తమ ఆశలన్నింటినీ ఓజి సినిమాపైనే పెట్టుకున్నారు. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం ఫ్యాన్స్ మొదటి నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 25న ఓజి ప్రేక్షకుల ముందుకు రానుంది. అంటే రిలీజ్ కు మరో మూడు వారాలే టైముంది. ఈ నేపథ్యంలో మేకర్స్ చిత్ర ప్రమోషన్స్ ను వేగవంతం చేయాలని చూస్తున్నారు.
ఉస్తాద్ భగత్‌సింగ్ నుంచి స్టైలిష్ పోస్టర్
ఓజి తో పాటూ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ మూవీ గబ్బర్‌సింగ్ తర్వాత పవన్, హరీష్ కలయికలో వస్తున్న మూవీ కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ పై కూడా మంచి అంచనాలున్నాయి. అయితే ఓజి సినిమా రిలీజ్ దగ్గరలో ఉన్నందున ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి పెద్దగా అప్డేట్స్ ఏమీ ఇవ్వకుండా కేవలం పోస్టర్ ను మాత్రమే రిలీజ్ చేస్తామని ముందే చెప్పారు మేకర్స్. చెప్పినట్టుగానే పవన్ బర్త్ డే కు ఓ రోజు ముందుగానే ఓ స్టైలిష్ పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.
ఉస్తాద్ భగత్‌సింగ్ నుంచి పోస్టర్ ను రిలీజ్ చేస్తూ పవన్ కు బర్త్ డే విషెస్ తెలిపిన హరీష్ శంకర్, తాను తన అభిమాన హీరో, పవర్ స్టార్ ను ఎలాగైతే చూడాలనుకున్నానో అలానే చూపించానని, పోస్టర్ ఆడియన్స్ కు కూడా నచ్చుతుందనుకుంటున్నానంటూ పోస్ట్ చేశారు. కాగా ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి వచ్చిన కొత్త పోస్టర్ కు ఫ్యాన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.
ఓజి నుంచి స్పెషల్ గ్లింప్స్
ఇక ఓజి నుంచి పవన్ బర్త్ డే సందర్భంగా ఓ స్పెషల్ గ్లింప్స్ తో పాటూ ఓ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. ఇవి కాకుండా కొత్త సినిమాలకు సంబంధించిన అనౌన్స్‌మెంట్స్ కూడా ఉంటాయని అందరూ భావించారు కానీ అలాంటివేమీ లేవని తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేయడానికే చాలా కష్టపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త సినిమాలు ఒప్పుకుని మళ్లీ ఇబ్బంది పడటమెందుకుని ఇకపై ఎక్కువగా సినిమాల్లో నటించడానికి బదులు నిర్మిస్తానని పవన్ చెప్పిన సంగతి తెలిసిందే. మొత్తానికి ఈ ఇయర్ పవన్ పుట్టిన రోజు వరుస అప్డేట్స్ తో ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టేలా ఉంది.