‘పిక్ ఆఫ్ ది డే’.. పవన్ కళ్యాణ్ - అన్నా కొణిదెల స్పెషల్ మూమెంట్ వైరల్!

నేవీ అధికారులు గైడ్ చేస్తుంటే, వైట్ అండ్ వైట్ కుర్తాలో పవన్ చాలా క్లాస్‌గా.. అన్నా కొణిదెల గారు బ్లూ కలర్ శారీలో చాలా హుందాగా రెడ్ కార్పెట్ మీద నడుచుకుంటూ వచ్చారు.;

Update: 2026-02-18 08:22 GMT

విశాఖపట్నం బీచ్ ఇప్పుడు ఫుల్ కోలాహలంగా ఉంది. దేశ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గారు పాల్గొన్న ‘ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ’ వైజాగ్ తీరంలో గ్రాండ్ గా జరిగింది. ఒకటా రెండా.. ఏకంగా 71 యుద్ధ నౌకలు లైన్ కట్టి నిలబడి రాష్ట్రపతి గారికి సెల్యూట్ చేస్తుంటే ఆ సీనే వేరే లెవల్లో ఉంది. ఈ వేడుకను చూడటానికి దేశ విదేశాల నుంచి నేవీ ఆఫీసర్లతో పాటు మన లీడర్లు కూడా క్యూ కట్టారు.

 

ఈ భారీ ఈవెంట్ లో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంకా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొన్నారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం ఒక ఫోటో బాగా చక్కర్లు కొడుతోంది. అదే ఈ రోజు ‘పిక్ ఆఫ్ ది డే’. నౌకాదళ విన్యాసాల కోసం వైజాగ్ వచ్చిన పవన్ కళ్యాణ్తన సతీమణి అన్నా కొణిదెలతో కలిసి ఒకే ఫ్రేమ్‌లో కనిపించి అందరినీ సర్ప్రైజ్ చేశారు.

 

నేవీ అధికారులు గైడ్ చేస్తుంటే, వైట్ అండ్ వైట్ కుర్తాలో పవన్ చాలా క్లాస్‌గా.. అన్నా కొణిదెల గారు బ్లూ కలర్ శారీలో చాలా హుందాగా రెడ్ కార్పెట్ మీద నడుచుకుంటూ వచ్చారు. ఈ ఫోటో చూసిన వాళ్లంతా ‘పర్ఫెక్ట్ కపుల్’ అంటూ నెట్టింట పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. వైజాగ్ లో జరుగుతున్న ఈ ‘మిలన్’ వేడుకలు కేవలం మన నేవీ పవర్ చూపడమే కాదు, ఇతర దేశాలతో మనకున్న దోస్తీని కూడా పెంచుతాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా తగ్గకుండా గెస్ట్‌ల కోసం అన్ని ఏర్పాట్లు పక్కాగా చేసింది.

 

యుద్ధ నౌకల మధ్య రాష్ట్రపతి గారు విజిట్ చేస్తుంటే, తీరంలో ఉన్న ప్రముఖులంతా మన సైనిక శక్తిని చూసి మురిసిపోయారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సతీమణి ఇలాంటి ఇంటర్నేషనల్ ఈవెంట్స్‌లో కనిపించడం చాలా రేర్. అందుకే ఈ ఫోటోకు ఇంత క్రేజ్ వచ్చింది. పవన్ అఫీషియల్ గా అధికారులతో డిస్కస్ చేస్తూ నడుస్తుంటే, అన్నా కొణిదెల గారు చాలా సైలెంట్ గా ఆయన్ని ఫాలో అవ్వడం ఆ ఫోటోలో హైలైట్ గా నిలిచింది. ఒక పక్క యుద్ధ నౌకల హడావిడి ఉన్నా, కెమెరాలన్నీ ఈ జంట వైపే తిరిగాయి.

 

ఇక పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికి వస్తే.. గత ఏడాది హరిహర వీరమల్లు, OG అంటూ రెండు సినిమాలను రిలీజ్ చేశారు. అందులో OG మంచి విజయాన్ని అందుకుంది. ఇక పొలిటికల్ గా మరింత బిజీ అయిన పవన్ సినిమాలు చేస్తారా లేదా అనే డౌట్స్ వస్తున్న సమయంలో సురేందర్ రెడ్డి ప్రాజెక్టుపై మరోసారి అఫీషియల్ క్లారిటీ ఇచ్చేశారు. ఈ సినిమా స్క్రిప్టు పనుల్లో బిజీగా ఉన్న మేకర్స్ త్వరలోనే మరో అప్డేట్ ఇచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News