పవన్, అజిత్ ఫ్యాన్స్ మధ్య గొడవేంటి?

ఇప్పుడు రెండు సినిమాలు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. గుడ్ బ్యాడ్ అగ్లీ ఎప్పటి నుంచో అందుబాటులోకి రాగా.. పవన్ మూవీ ఇటీవల అందుబాటులోకి వచ్చింది.;

Update: 2025-10-26 15:51 GMT

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కోలీవుడ్ ప్రముఖ హీరో అజిత్ కుమార్ గురించి అందరికీ తెలిసిందే. ఇద్దరికీ మంచి ఫ్యాన్ బేస్ ఉండగా.. చరిష్మా పరంగా పవన్‌ కల్యాణ్‌ కు, అజిత్‌ కు మధ్య అప్పుడప్పుడు కంపేరిజన్‌ చేస్తుంటారు. ఇప్పుడు ఈ ఏడాది సినిమాల విషయంలో పోలుస్తూ డిస్కస్ చేసుకుంటున్నారు అభిమానులు. చిన్నపాటి మాటల యుద్ధం కూడా జరుగుతుందండోయ్. అసలేం జరిగిందంటే?

నిజానికి లాస్ట్ ఇయర్ తమ సినిమాలతో అటు పవన్.. ఇటు అజిత్ ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్‌ బిజీ అయ్యారు. అజిత్‌ తనకు నచ్చిన రేసింగ్‌ లో పాల్గొన్నారు. ఇప్పుడు ఈ ఏడాది తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. చివరగా అజిత్.. గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీతో సందడి చేశారు. ఆడియెన్స్ ను అలరించి మంచి సక్సెస్ అందుకున్నారు.

గుడ్ బ్యాడ్ అగ్లీలో అధిక్ రవిచంద్రన్ తన ఫేవరెట్ హీరోని ది బెస్ట్ అనేలా చూపించి మెప్పించారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్.. రీసెంట్ గా ఓజీ సినిమాతో సందడి చేశారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బాయ్ మూమెంట్ గా యంగ్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కించి అదరగొట్టారు. ముఖ్యంగా అభిమానులను తెగ అలరించారు. మిగతా ఆడియన్స్ ను కూడా ఆకట్టుకున్నారు.

ఇప్పుడు రెండు సినిమాలు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. గుడ్ బ్యాడ్ అగ్లీ ఎప్పటి నుంచో అందుబాటులోకి రాగా.. పవన్ మూవీ ఇటీవల అందుబాటులోకి వచ్చింది. దీంతో ఓజీ మూవీని సినీ ప్రియులు, అభిమానులు తెగ చూసేస్తున్నారు. అదే సమయంలో రెండు చిత్రాలను కంపేర్ చేస్తున్నారు మూవీ లవర్స్.

నిజానికి.. ఓజీ, గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాల్లో హీరోలకు మామూలు ఎలివేషన్లు ఉండవు. ఎందుకంటే డైరెక్టర్లు తమ ఫేవరెట్ హీరోలతో వర్క్ చేయడంతో.. తమలోని టాలెంట్ మొత్తాన్ని బయటపెట్టారు. ఓ రేంజ్ లో పవన్, అజిత్ కు ఎలివేషన్లు ఇచ్చారు. ఫ్యాన్స్ ఎలా కోరుకుంటున్నారో.. అదే విధంగా సినిమాలను ప్లాన్ చేశారు. అభిమానులను విపరీతంగా మెప్పించారు.

అయితే ఇప్పుడు ఇద్దరు హీరోల ఫ్యాన్స్ సోషల్ మీడియాలో డిస్కషన్లు చేసుకుంటున్నారు. మా హీరో మూవీ బాగుందంటే.. మా హీరో సినిమా బాగుందంటూ పలువురు కామెంట్స్ పెడుతున్నారు. ఓజీ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయినప్పుడు ఎలాంటి డిస్కషన్ లేకపోయినా.. ఇప్పుడు మాత్రం డిస్కషన్ లోకి దిగారు. ఒక్కొక్కరు ఒక్కోలా రెస్పాండ్ అవుతున్నారు. దీంతో ఆ విషయం హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News