ఫేక్ టాక్ షో.. బేబీ బంప్ తో దర్శనమిచ్చిన పరిణితి చోప్రా.. సో క్యూట్!

బాలీవుడ్ నటి పరిణితి చోప్రా ప్రస్తుతం ప్రెగ్నెంట్ అనే విషయం మనకు తెలిసిందే.;

Update: 2025-10-07 12:49 GMT

బాలీవుడ్ నటి పరిణితి చోప్రా ప్రస్తుతం ప్రెగ్నెంట్ అనే విషయం మనకు తెలిసిందే. అయితే ఇప్పటివరకు పరిణితి చోప్రా తన ప్రెగ్నెన్సీకి సంబంధించి ఎక్కువ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకోలేదు. కానీ తాజాగా తన ప్రెగ్నెన్సీకి సంబంధించి ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అందులో తన బేబీ బంప్ ని ఎక్స్పోజ్ చేయకపోయినప్పటికీ బేబీ బంప్ స్పష్టంగా కనిపిస్తోంది.. తాజాగా "ఫేక్ టాక్ షో" అంటూ తన భర్తతో కలిసి ఒక యూట్యూబ్ వ్లాగ్ చేసింది. ఈ వ్లాగ్ లో తన బేబీ బంప్ తో అలరించింది పరిణితి చోప్రా.

విషయంలోకి వెళ్తే..మాతృత్వం అనేది సాధారణ విషయం కాదు. ఆడవారిగా జన్మ ఎత్తినప్పుడు తల్లి అయితేనే ఆడజన్మకు పరిపూర్ణత అనేది ఉంటుంది.అలా తాజాగా బాలీవుడ్ నటి పరిణితి చోప్రా కూడా ప్రెగ్నెన్సీ తర్వాత మళ్లీ యూట్యూబ్లోకి తిరిగి వచ్చేసింది.. తాజాగా ఈ నటి ఫేక్ టాక్ షో కి సంబంధించిన ఎపిసోడ్ నుండి ఓ వీడియో షేర్ చేసుకుంది. ఇందులో పరిణితి చోప్రా నవ్వులు, మాటలు ఆమె ఆత్మ విశ్వాసాన్ని ప్రకాశింపజేస్తున్నాయి. ఇందులో తన బేబీ బంప్ ని ఎక్కువగా చూపించలేదు. సాధారణంగానే కనిపించింది. కానీ బేబీ బంప్ మాత్రం చూసే వీక్షకులకు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వ్లాగ్ లో పరిణితి చోప్రా నీలిరంగులో ఉండే డెనిమ్ దుస్తుల్లో కనిపించింది. అలాగే తన భర్త రాఘవ్ చద్దాతో జరిగిన ఫన్నీ సంభాషణని ఈ వీడియోలో పంచుకుంది..ఈ ఫేక్ టాక్ షో ఎపిసోడ్ లో ది కపిల్ శర్మ షోలో ఉండేలాంటి ప్రశ్నలను అడిగింది..

ఇందులో పరిణితి చోప్రా, రాఘవ చద్దా ఇద్దరు తమ వ్యక్తిగత జీవితాల గురించి, ఎవరు ఎక్కువ రొమాంటిక్, క్రిస్మస్ టైం లో హాలిడేస్ కి ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారు.. ఐస్లాండ్ లేదా ఫిన్లాండ్, జపాన్ ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు ఒకరినొకరు అడుగుతూ చూసేవారికి నవ్వులు పుట్టించారు... అలా ప్రస్తుతం పరిణితి చోప్రా కి సంబంధించిన ఈ వ్లాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం పరిణితి చోప్రా రెండో త్రైమాసికం లో ఉన్నట్టు తెలుస్తోంది. సినిమాలకు దూరంగా ఉన్న పరిణీతి చోప్రా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు దగ్గరగా ఉంటుంది..

పరిణితి చోప్రా మాతృత్వం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "తల్లి అవ్వడం ప్రతి మహిళకు ఒక వరం లాంటిది.. నాకు ఒకరిద్దరు పిల్లలు చాలదు. గంపెడు మంది పిల్లలకు తల్లినవ్వాలి అనే కోరిక ఉంది.కానీ అంతమంది పిల్లల్ని నేను కనకపోవచ్చు.. కానీ చాలామంది పిల్లల్ని దత్తత తీసుకొని వారితో అమ్మా అని పిలిపించుకుంటాను" అంటూ అమ్మా అనే పిలుపు గురించి, మాతృత్వం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Full View
Tags:    

Similar News