తల్లి అయిన స్టార్ హీరోయిన్.. పోస్ట్ వైరల్!

గత కొన్ని రోజులుగా స్టార్ హీరోయిన్ తల్లి కాబోతోంది అంటూ వచ్చిన వార్తలు నేడు నిజమయ్యాయి. పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది ఈ ముద్దుగుమ్మ.;

Update: 2025-10-19 13:51 GMT

గత కొన్ని రోజులుగా స్టార్ హీరోయిన్ తల్లి కాబోతోంది అంటూ వచ్చిన వార్తలు నేడు నిజమయ్యాయి. పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ తన సంతోషాన్ని వ్యక్తపరిచింది.. ఆమె ఎవరో కాదు ప్రముఖ బ్యూటీ పరిణీతి చోప్రా. గ్లోబల్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా చెల్లెలు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన పరిణీతికి నేషనల్ వైడ్ గా మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే.


గత ఏడాది ఆప్ పార్టీ ఎంపీ రాఘవ చద్దాను ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది.తాజాగా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ జంట.. ఈరోజు మా హృదయాలు సంతోషంతో నిండిపోయాయి. మొత్తానికి మా బేబీ బాయ్ వచ్చేసాడు. ఈరోజు కోసమే మేము చాలా ఎదురు చూస్తున్నాం.. అతన్ని చేతిలోకి తీసుకోవడానికి ఇక ఎదురు చూడలేకపోతున్నాము. మీ ప్రేమ, ఆప్యాయతకు ధన్యవాదాలు అంటూ తెలిపింది.

ఇకపోతే పరిణితి చోప్రాకి కొడుకు పుట్టడంతో ఈ విషయం తెలుసుకున్న ప్రియాంక చోప్రా అమెరికా నుంచి ఇండియా బయలుదేరినట్లు సమాచారం. మొత్తానికైతే తమ సోదరికి కొడుకు పుట్టాడన్న ఆనందంతో ప్రియాంక చోప్రా ఉబ్బితబ్బివతున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రియాంక చోప్రాకి కూతురు ఉన్న విషయం తెలిసిందే. మరొకవైపు రాఘవ్ చద్దా ఇటీవల రాజ్యసభ ఎంపీగా ప్రమోషన్ కూడా పొందారు. మొత్తానికైతే దీపావళి ముందే ఈ ఇంట్లో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి.

పరిణితి చోప్రా, రాఘవ చద్దా పెళ్లి విషయానికొస్తే.. 2023 మే లో న్యూఢిల్లీలోని కపుర్తాలా లో వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. అదే ఏడాది సెప్టెంబర్ లో రాజస్థాన్లోని ఉదయపూర్ లో ఢిల్లీలో ప్యాలెస్ లో చాలా గ్రాండ్గా వివాహం జరిగింది. ఇక ఆగస్టులో ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో త్వరలో ఒక బిడ్డ పుట్టబోతున్నట్లు సూచిస్తూ.." ఇస్తాం.. మీకు ఇస్తాం.. శుభవార్త త్వరలోనే ఇస్తాం" అంటూ తెలిపారు. ఇక ఎట్టకేలకు పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఇక ప్రస్తుతం ఈ విషయం తెలియడంతో పలువురు. సెలబ్రిటీలు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.అంతేకాదు బాబు ఫోటోని రివీల్ చేయమని కూడా కోరుతున్నారు.

Tags:    

Similar News