15 రోజులు త‌న మూత్రం తానే తాగిన న‌టుడు

నేను రెండున్న‌ర‌ నెలల్లో ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్ కావాల్సి ఉన్నా కానీ, 1.5 నెలల్లోనే డిశ్చార్జ్ అయ్యాను.. అది మాయాజాలం లాంటిది అని ప‌రేష్ రావ‌ల్ అన్నారు.;

Update: 2025-04-28 14:21 GMT

డాక్ట‌ర్లు రాసే మెడిసిన్ కి గాయాలు త‌గ్గుతాయి కానీ త‌న మూత్రం (యూరిన్) తానే తాగితే గాయం మానుతుందా? కానీ ఈ న‌టుడి గాయం మూత్రం తాగితే త‌గ్గింద‌ట‌. విన‌డానికి విస్తుగొలుపుతున్నా ఇది నిజం. అత‌డు త‌న మూత్రాన్ని 15 రోజుల పాటు వ‌రుస‌గా గ్లాసులోకి ప‌ట్టుకుని తాగాడ‌ట‌. దెబ్బ‌కు గాయం మ‌టుమాయ‌మైంది. అక్క‌డ తెల్ల గీత రావ‌డం డాక్ట‌ర్ క‌నిపెట్టాడు! అని చెప్పారు స‌ద‌రు న‌టుడు. త‌న మూత్రం త‌నే తాగిన ఈ న‌టుడు ఎవ‌రు? అంటే.. ప‌రేష్ రావ‌ల్. శంక‌ర్ దాదా ఎంబిబిఎస్‌లో డాక్ట‌ర్ మామ‌గా న‌టించి అద్భుత‌మైన న‌వ్వులు పూయించిన అత‌డి కామెడీ టైమింగ్ ని ప్రేక్ష‌కులు అంత తేలిగ్గా మ‌ర్చిపోలేరు.

తాను గాయానికి చికిత్స పొందుతుండ‌గా, అజయ్ దేవ్‌గన్ తండ్రి వీరు దేవ్‌గన్ 15 రోజులు మూత్రం తాగమని సల‌హా ఇచ్చారు. నేను అలాగే చేసాను. 15 రోజులు అలా చేశాక డాక్ట‌ర్ నా ఎక్స్ రే చూసి షాక్ అయ్యాడు. ఈ సిమెంటింగ్ ఎలా జరిగింది?.. తెల్లటి గీత‌ను వైద్యుడు చూసాడు`` అని తెలిపారు. నేను రెండున్న‌ర‌ నెలల్లో ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్ కావాల్సి ఉన్నా కానీ, 1.5 నెలల్లోనే డిశ్చార్జ్ అయ్యాను.. అది మాయాజాలం లాంటిది అని ప‌రేష్ రావ‌ల్ అన్నారు.

ఇదే ఇంట‌ర్వ్యూలో త‌న సీనియ‌ర్ న‌టుడు నానా ప‌టేక‌ర్ గురించి మాట్లాడుతూ.. నానా నేను కలిసి భోజ‌నం చేసాక ఒక నిర్మాత ఎవ‌రి కంచం వాళ్ల‌ను క‌డుక్కోమ‌న్నారు. బాప్ రే అది నానా పటేకర్! అత‌డు ఒక లెజెండ్. అతడు భిన్న‌మైన‌వాడు. వేరే అచ్చుతో తయారయ్యాడు! అని పరేష్ రావల్ అన్నారు. ఇండ‌స్ట్రీలో కోటి డిమాండ్ చేసిన మొద‌టి స‌హాయ‌న‌టుడు నానా ప‌టేక‌ర్ అని కూడా కీర్తించారు. ఒక క‌ళాకారుడు నిజ‌మైన అనుబంధం ఉంటే ఒక్క రూపాయికి అయినా ప‌ని చేస్తాడు.. అది లేక‌పోతే కోటి ఇచ్చినా ఒప్పించ‌లేరు! అని ప‌రేష్ రావ‌ల్ అన్నారు. పెద్ద స్టార్లు కూడా నానా రేంజులో డిమాండ్ చేయ‌లేదు.. ఆయ‌న అడిగాడు.. సాధించుకున్నాడు! అని పొగిడేశారు.

Tags:    

Similar News