సృజనాత్మక ఘర్షణతో ముగ్గురు స్టార్లు ఔట్!
ఒకే సీజన్ లో ముగ్గురు స్టార్లు మూడు డిఫరెంట్ సినిమాల నుంచి తప్పుకుని ఆశ్చర్యపరిచారు.;
ఒకే సీజన్ లో ముగ్గురు స్టార్లు మూడు డిఫరెంట్ సినిమాల నుంచి తప్పుకుని ఆశ్చర్యపరిచారు. ముఖ్యంగా ప్రియదర్శన్ `హేరా ఫేరి 3` నుంచి పరేష్ రావల్ తప్పుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. థియేటర్లలో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించిన పాత్రలు - రాజు (అక్షయ్ కుమార్), శ్యామ్ (సునీల్ శెట్టి), బాబూరావు గణపత్రావ్ ఆప్టే (పరేష్ రావల్) లతో హేరా ఫేరీ 3ని ప్రకటించారు. హేరాఫేరి, హేరాఫేరి 2 కోసం కొంత గ్యాప్ తీసుకున్నా ఈ మూడోభాగాన్ని తెరకెక్కించేందుకు దర్శకుడు ప్రియదర్శన్ కొన్నేళ్ల పాటు ఎదురు చూసారు. అయితే కొత్త ప్రాజెక్టులో పరేష్ రావల్ ..దర్శకనిర్మాతలతో సృజనాత్మక విభేదాల కారణంగా ఈ చిత్రం నుండి తప్పుకున్నట్లు కథనాలొచ్చాయి.
అదే సమయంలో మరో క్రేజీ ప్రాజెక్ట్ `నో ఎంట్రీ 2` నుండి దిల్జీత్ దోసాంజ్ తప్పుకున్నాడు. చిత్ర నిర్మాత బోనీ కపూర్ ఫిల్మ్‌ఫేర్‌తో మాట్లాడుతూ మా మధ్య సృజనాత్మక విభేధాలవీ లేవు.. కాల్షీట్ల సమస్య ఉందని క్లారిటీ ఇచ్చేసారు. తేదీలు ఎడ్జస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నామని కూడా బోనీ అన్నారు. కానీ దిల్జీత్ ఇతర ప్రాజెక్టుల వైపు మొగ్గు చూపుతున్నాడని సమాచారం.
ఇంతలోనే మరో యువహీరో ఆయుష్మాన్ ఖుర్రానా కూడా మోస్ట్ అవైటెడ్ `బోర్డర్ 2` నుండి తప్పుకున్నాడని కథనాలొస్తున్నాయి. ఈ సీక్వెల్ చిత్రంలో సైనికుడిగా నటించడానికి దర్శకనిర్మాతలతో ఆయుష్మాన్ చర్చలు జరిపాడని కథనాలొచ్చాయి. ఆయుష్మాన్ ఈ చిత్రంలో నటించేందుకు ఆసక్తిగా ఉన్నా కానీ, దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా లేదు. ఇప్పుడు ఏకంగా తప్పుకున్నాడని ప్రచారం సాగుతోంది. ఇందులో సన్నీడియోల్ కథానాయకుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
భారతీయ చిత్ర పరిశ్రమలో నానా పటేకర్, పరేష్ రావల్ ఇద్దరు అత్యుత్తమ నటులు. భారతదేశంలో కోటి రూపాయలు డిమాండ్ చేసిన మొదటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ పరేష్ రావల్. అలాంటి ఆర్టిస్ట్ ఏదో ఒక కారణంతో హేరా ఫేరి-3 నుంచి తప్పుకుంటే అది ఆ ఫ్రాంఛైజీ విలువను దిగజార్చుతుంది.