99 శాతం హిందీ సినిమాలు అవే.. బాలీవుడ్ పై పంచాయత్ నటుడి కామెంట్స్
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇటీవల రిలీజైన పంచాయత్ వెబ్ సిరీస్ సీజన్ 4 ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.;
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇటీవల రిలీజైన పంచాయత్ వెబ్ సిరీస్ సీజన్ 4 ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సిరీస్ నుంచి ఇప్పటికే రిలీజైన నాలుగు సీజన్ లకు మంచి స్పందన లభించింది. ఈ సిరీస్ లో కీలక పాత్ర పోషించిన ప్రముఖ నటుడు పంకజ్ ఝా నటనకు మంచి మార్కులు పడ్డాయి. అయితే ఇవన్నీ అటుంచితే పంకజ్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పంజక్ బాలీవుడ్ ఇండస్ట్రీపై కొన్ని కామెంట్స్ చేశారు. ఇవి ప్రస్తుతం కాంట్రవర్సీకి దారి తీశాయి. పంకజ్ ఝా ఈ ఇంటర్వ్యూలో బాలీవుడ్ సినిమాల గురించి వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం హిందీ సినిమాలు చూసినట్లైతే, వందలో యాభై ఐదు నుండి తొంభై తొమ్మిది శాతం సినిమాలు రిహబిలేషన్ సెంటర్ నుండి వచ్చిన వారి కోసమే తీస్తున్నట్లు అనిపిస్తుంది. అని పంకజ్ అన్నారు.
అయితే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు ప్రేక్షకులను షాకింగ్ కు గురి చేస్తున్నాయి. ఇవి ఇండస్ట్రీనే కాకుండా, ప్రేక్షకులను సైతం అగౌరవ పరిచేలా ఉన్నాయన నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా పంచాయత్ లాంటి సిరీస్ విజయం తర్వాత ఆయన వ్యాఖ్యలు పలువురిని ఆశ్చర్యపరుస్తున్నాయి.
కాగా, సెలబ్రిటీలు ఓసారి పబ్లిక్ ఫిగర్ అయ్యాక, ఏది మాట్లాడాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించి మాట్లాడాల్సి ఉంటుంది. ఎప్పుడూ లైమ్ లైట్ లో ఉండాలన్న ఉద్దశ్యంతో ఇలాంటి స్టేట్ మెంట్లు పలుమార్లు మిస్ ఫైర్ అవుతాయి. అయితే సోషల్ మీడియా వాడకం ఎక్కువైన తర్వాత సెలబ్రిటీలు ఈవెంట్లు, ఇంటర్వ్యూలో ఏం మాట్లాడినా ప్రేక్షకులు క్షుణ్ణంగా పరిశీస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గతంలో పంజక్ ఝా సైతం బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించారు. ఆయన ఢిల్లీ- 6, అత్రంగి రే, గులాల్ వంటి సినిమాల్లో కీలక పాత్ర పోషించారు.
ఈ పంచాయత్ వెబ్ సిరీస్ భారీ సెట్స్, గ్రాండ్ విజువల్స్ కు భిన్నంగా తెరకెక్కింది. పూర్తిగా పల్లెటూరి వాతావరణం, గ్రామంలో ఉండే సమస్యలు, మూడ నమ్మకాలు ఇలాంటి అంశాలతో ఇది తెరకెక్కింది. ఇక ఈ సిరీస్ ఐదో సీజన్ 2026లో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.