తారక్ గ్లింప్స్ మ్యూజిక్ సంగతేంటి? ఫ్యాన్స్ టెన్షన్ అందుకేనా?

కానీ సోషల్ మీడియాలో మాత్రం భారీ స్పోర్ట్స్ డ్రామాకు ఇంకా పవర్‌ ఫుల్ మ్యూజిక్ కావాలనే అభిప్రాయం బలంగా కనిపించింది.

Update: 2026-05-19 08:05 GMT

పాన్ ఇండియా మూవీల ట్రెండ్ లో హీరోల లుక్, స్కేల్, యాక్షన్ ఎంత ముఖ్యమో.. ఇప్పుడు మ్యూజిక్ కూడా అంతకంటే కీలకంగా మారింది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల్లో విడుదలయ్యే చిన్న గ్లింప్స్‌ లో కూడా ఇప్పుడు అభిమానులు బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ ను చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేస్తున్నారు. తాజాగా అదే అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఒక స్టార్ హీరో అభిమానులను సంతృప్తి పరచలేకపోయిన సంగీత దర్శకుడు, మరొక స్టార్ హీరో మూవీకి మ్యూజిక్ అందిస్తే ఎలా ఉంటుందన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇటీవల విడుదలైన పెద్ది ట్రైలర్‌ లో ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ పై మిక్స్డ్ ఓపీనియన్స్ వినిపించాయి. కొంతమంది ట్రైలర్‌ కు తగ్గ ఎమోషన్ మిస్సయ్యిందని కామెంట్లు చేస్తే.. మరికొందరు మాత్రం రెహమాన్ స్టైల్ ఎప్పుడూ డిఫరెంట్‌ గా ఉంటుందని సమర్థించారు.

కానీ సోషల్ మీడియాలో మాత్రం భారీ స్పోర్ట్స్ డ్రామాకు ఇంకా పవర్‌ ఫుల్ మ్యూజిక్ కావాలనే అభిప్రాయం బలంగా కనిపించింది. అక్కడి నుంచే ఇప్పుడు మరో చర్చ మొదలైంది. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- అట్లీ భారీ సినిమాపై అభిమానుల్లో సందేహాలు మొదలయ్యాయి. కరుప్పు సినిమా మ్యూజిక్ విన్న తర్వాత.. బన్నీ ఇమేజ్‌ కు సాయి అభ్యంకర్ ఎలా జస్టిఫై చేస్తారో చూడాలనే ఆసక్తి పెరిగింది.

ముఖ్యంగా అల్లు అర్జున్ సినిమాలకు థియేటర్లలో ఊగిపోయే బీట్‌లు, ఎలివేషన్ స్కోర్లు అనేవి అభిమానులు ఎక్కువగా ఆశిస్తారు. అందుకే ఆ ప్రాజెక్టులో మ్యూజిక్ ఇప్పుడు కీలక చర్చగా మారింది. అదే సమయంలో మరికొన్ని గంటల్లో విడుదల కానున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ మూవీ గ్లింప్స్‌ పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

ఇప్పటికే కేజీఎఫ్, సలార్ వంటి చిత్రాలతో భారీ మాస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు బ్రాండ్‌ గా మారిన రవి బస్రూర్.. తారక్ ఫ్యాన్స్‌ ను ఏ స్థాయిలో మెప్పిస్తాడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే తెలుగు స్టార్ హీరోల అభిమానులు ఇప్పుడు కేవలం పాటలకే కాకుండా.. హీరో ఎంట్రీ, డైలాగ్, యాక్షన్ బ్లాక్, గ్లింప్స్ కట్.. ప్రతి మూమెంట్ కు థియేటర్ షేక్ అయ్యే రేంజ్ బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ కోరుకుంటున్నారు.

ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు తమ స్టార్ హీరోల ఇమేజ్‌ పై ప్రత్యేకమైన అంచనాలు ఉంటాయి. ఆ ఇమేజ్‌ కు తగ్గ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వినిపించకపోతే వెంటనే సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలవుతోంది. అందుకే ఒకప్పుడు దర్శకుడు, హీరోలపై మాత్రమే ఉండే ఒత్తిడి.. ఇప్పుడు సంగీత దర్శకులపైనా పడుతోంది. ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే.. ప్రస్తుతం ఆ మూడు భారీ ప్రాజెక్టులకు పనిచేస్తున్న సంగీత దర్శకులు ముగ్గురు కూడా తెలుగు ఇండస్ట్రీకి చెందినవారు కాదు. ఏదేమైనా తారక్ గ్లింప్స్‌ రిలీజ్ అవనున్న వేళ.. అభిమానులు కేవలం విజువల్స్ కోసమే కాదు రవి బస్రూర్ ఇచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం కూడా ఎదురుచూస్తున్నారు. మరేం జరుగుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News