పిక్ టాక్ : నడుము అందంతో మత్తెక్కిస్తున్న తివారీ
ఈమె రెగ్యులర్‌గా తన అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.;
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా రాణించాలంటే మొదట సోషల్ మీడియాలో పాపులారిటీ దక్కించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. హీరోయిన్‌గా చిన్న సినిమాలో నటించాలి అంటే ఇన్‌స్టాలో మినిమం మిలియన్ ఫాలోవర్స్ ఉండాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సొంతం చేసుకున్న వారికి ఆటోమేటిక్‌గా ఆఫర్లు వస్తూ ఉంటాయి. అంతే కాకుండా సోషల్ మీడియాలో వారిని అనుసరించే ఫాలోవర్స్ సంఖ్య ఆధారంగా సినిమాల్లో నటించినందుకు గాను పారితోషికం ఇవ్వడం జరుగుతుంది. అందుకే హీరోయిన్‌గా నటించాలని ఆసక్తి ఉన్న వారు మొదటి నుంచే సోషల్ మీడియాలో తమ అందమైన ఫోటోలను షేర్ చేయడం మనం చూస్తూ ఉంటాం. ప్రస్తుతం బాలీవుడ్ అప్‌కమింగ్ హీరోయిన్ పాలక్ తివారీ గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది.
సోషల్ మీడియాలో అందాల ఆరబోత
ఈమె రెగ్యులర్‌గా తన అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇండస్ట్రీలో అడుగు పెట్టి కొన్నాళ్లే అయినా అప్పుడే ఈమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపుగా అయిదు మిలియన్‌ల ఫాలోవర్స్ ఉన్నారు. చాలా తక్కువ సమయంలోనే ఈ అమ్మడు ఈ స్థాయి ఫాలోవర్స్‌ను దక్కించుకుంది. అందుకు కారణం ఈమె షేర్ చేసే అందమైన ఫోటోలు అనడంలో సందేహం లేదు. హీరోయిన్‌గా ఇండస్ట్రీలో ఆఫర్లు దక్కించుకుంటూ మెల్ల మెల్లగా కెరీర్‌ను బిల్డ్ చేసుకుంటున్న పాలక్ తివారీ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న అందాల ఆరబోత ఫోటో షూట్స్ కారణంగా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడం మనం చూస్తూ ఉంటాం.
నడుము, నాభి అందాలతో మతి పోగొడుతోంది
పాలక్ తివారీ తాజాగా మరోసారి తన అందమైన ఫోటోలను షేర్ చేసింది. ఆకట్టుకునే అందంతో పాటు, మంచి ఫిజిక్ నా సొంతం అంటూ ఈ ఫోటోలతో నిరూపించుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. వైట్ డ్రెస్ లో క్లీన్ బ్యూటీ అన్నట్లుగా స్కిన్ షో చేసింది. నడుము, నాభి అందం చూపిస్తూ మతెక్కిస్తున్న ఈ అమ్మడి అందానికి ఫిదా అవుతున్న వారు చాలా మంది ఉన్నారు. సోషల్ మీడియాలో ఇంతగా అందాల ఆరబోత చేస్తున్న పాలక్ తివారీకి పాపం దక్కాల్సిన స్థాయిలో ఆఫర్లు దక్కడం లేదు అనేది కొందరి అభిప్రాయం. సోషల్ మీడియాలో ఇదే రేంజ్ లో అందాల ఆరబోత చేస్తే తప్పకుండా ముందు ముందు అయినా బాలీవుడ్‌లో మోస్ట్ బిజీ హీరోయిన్‌గా ఆఫర్లు సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి.
శ్వేతా తివారీ వారసురాలు ఈ పాలక్ తివారీ
ప్రముఖ బుల్లి తెర నటి శ్వేతా తివారీ కుమార్తె ఈ పాలక్ తివారీ అనే విషయం తెల్సిందే. బుల్లి తెరపై సుదీర్ఘ కాలంగా శ్వేతా తివారీ జోరు కొనసాగుతుంది. ఆమెకు సినిమా స్టార్స్ కి ఉన్న స్థాయిలో గుర్తింపు ఉంది. ఆ కారణంగానే పాలక్ తివారీకి ఇండస్ట్రీలో ఎంట్రీ ఈజీగానే లభించింది. మెల్ల మెల్లగా పాలక్ తివారీ స్టార్‌డం దక్కించుకునేందుకు గాను ప్రయత్నాలు చేస్తుంది. ఆకట్టుకునే అందం తో పాటు, మంచి ఫిజిక్ ఉన్న కారణంగా పాలక్ తివారీ పట్ల మేకర్స్ దృష్టి పెడుతున్నారు. భవిష్యత్తులో తప్పకుండా ఈమెకు ఇండస్ట్రీ స్టార్స్ నుంచి పిలుపు దక్కడం ఖాయం అంటూ ఈ ఫోటోలకు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. హైట్‌కి తగ్గ వెయిట్‌తో పాటు ఆకట్టుకునే రూపం ఈమె సొంతం. అందుకే బాలీవుడ్‌లోనే కాకుండా ఈమె భవిష్యత్తులో సౌత్ లోనూ పెద్ద హీరోలకు జోడీగా నటించే అవకాశాలు దక్కించుకుంటుందేమో చూడాలి.