• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఈవారం సందడి చేయబోతున్న...

ఈవారం సందడి చేయబోతున్న చిన్న సినిమాలు, ఓటీటీ మూవీస్..

| ఆగస్టులో సినీ లవర్స్ ను ఎంటర్టైన్ చేయడానికి థియేటర్లో ఎన్నో సినిమాలు వచ్చాయి. అలాగే ఈ వారం కొన్ని చిన్న సినిమాలు ప్రేక్షకులను మెప్పించడానికి వస్తున్నాయి

By - Tupaki Desk
Update: 2024-08-19 08:17 GMT

ఆగస్టులో సినీ లవర్స్ ను ఎంటర్టైన్ చేయడానికి థియేటర్లో ఎన్నో సినిమాలు వచ్చాయి. అలాగే ఈ వారం కొన్ని చిన్న సినిమాలు ప్రేక్షకులను మెప్పించడానికి వస్తున్నాయి. వీటితో పాటుగా మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా కొన్ని రీ రిలీజ్ లు కూడా ఉన్నాయి.ఇక ఇప్పుడూ ఓటీటీ ప్రేక్షకుల కోసం నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ హాట్‌స్టార్ లాంటి ఓటీటీ దిగ్గజ ప్లాట్‌ఫారమ్‌లలో ఈ వారం ఎన్నో సరికొత్త చిత్రాలు సందది చేయబోతున్నాయి. మరి ఆ చిత్రాల వివరాలు తెలుసుకుందాం..

రీ రిలీజ్:

ప్రస్తుతం స్టార్ హీరోల పుట్టినరోజుకి గతంలో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన చిత్రాలను రీ రిలీజ్ చేయడం బాగా ట్రెండింగ్ గా ఉంది.అందుకే ఆగస్టు 22న మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా ఇంద్ర, శంకర్ దాదా ఎంబిబిఎస్ చిత్రాలు తిరిగి విడుదల కాబోతున్నాయి.

చిన్న సినిమాలు:

మారుతీనగర్ సుబ్రహ్మణ్యం:

రావు రమేష్ ప్రధాన పాత్రలో మిడిల్ క్లాస్ వ్యక్తి జీవితాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తూ తెరకెక్కిచ్చిన చిత్రం మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం. ఈ చిత్రంలో ఇంద్రజ,అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. నడి వయసులో ఉన్న ఓ మధ్యతరగతి నిరుద్యోగి జీవితంలో చోటుచేసుకునే మలుపులను, అతను ఎదుర్కొనే పరిస్థితులను ఈ మూవీలో ఎంతో అద్భుతంగా చూపించారు. ఒకపక్క ఎమోషనల్ టచ్ తో పాటు కడుపుబ్బా నవ్వించే కామెడీ కూడా ఈ చిత్రానికి హైలైట్ అని తెలుస్తోంది. ఈ మూవీ ఆగస్టు 23న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

డిమాంటి కాలనీ 2:

తెలుగు ప్రేక్షకులు కామెడీ సినిమాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో హారర్ చిత్రాలకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారు. మంచి గ్రిప్పింగ్ కంటెంట్ ఉన్న థ్రిల్లర్ చిత్రాలను చూడడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో అరుల్ నిధి, ప్రియ భవానీ శంకర్ జంటగా నటించిన 'డిమాంటి కాలనీ 2' తమిళ్ డబ్బింగ్ చిత్రం తెలుగు ప్రేక్షకులను అలరించడానికి 23న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఒక కాలనీలో ఉన్న ఇంటి చుట్టూ సాగే ఈ సస్పెన్స్ కథ ప్రేక్షకులకు మంచి హారర్ థ్రిల్లర్ అనుభూతిని ఇస్తుంది.

కల్కి

ప్రభాస్,నాగ్ అశ్విన్‌ల కాంబోలో విడుదలైన కల్కి చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొట్టే కలెక్షన్స్ వసూలు చేసింది. మహాభారతం కాన్సెప్ట్ తో ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం ఈ నెల 22 నుంచి అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఓటీటీ లో సందడి చేయబోతోంది.

రాయన్

ధనుష్ రాయన్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఇప్పుడు ఈ నెల 23న నెట్ ఫిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.

వీటితోపాటుగా ఓటీటీ లో స్ట్రీమింగ్ అయ్యే మరికొన్ని చిత్రాల వివరాలు:

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ:

ఆగస్ట్ 20-టెర్రర్ ట్యూజ్‌డే: ఎక్స్‌ట్రీమ్ (థాయ్ వెబ్ సిరీస్)

ఆగస్ట్ 22

*జీజీ ప్రీసింక్ట్ (కొరియన్ వెబ్ సిరీస్)

*మెర్మైడ్ మ్యాజిక్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)

*ప్రెట్టీ గార్డియన్ సెయిలర్ మూన్ కాస్మోస్ ది మూవీ పార్ట్ 1 (జపనీస్ సినిమా)

ఆగస్ట్ 23

*ఇన్‌కమింగ్ (ఇంగ్లీష్ చిత్రం)

*ది ఫ్రాగ్ (కొరియిన్ వెబ్ సిరీస్)

అమెజాన్ ప్రైమ్ వీడియో :

ఆగస్ట్ 20- యాంగ్రీ యంగ్ మ్యాన్: ది సలీం జావేద్ స్టోరీ (హిందీ వెబ్ సిరీస్)

ఆగస్ట్ 23-

*ఫాలో కర్‌లో యార్ (హిందీ వెబ్ సిరీస్)

*రాయన్ (తెలుగు డబ్బింగ్ తమిళ సినిమా)

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ :

ఆగస్ట్ 20-గర్‌ర్‌ర్ (తెలుగు డబ్బింగ్ మలయాళ కామెడీ సినిమా)

ఆగస్ట్ 23-ది సుప్రీమ్ ఎట్ ఎర్ల్స్ యూ కెన్ ఈట్ (ఇంగ్లీష్ చిత్రం)

Tags:    
  • Ottmovie 
  • Tollywood 
  • Chianjeevi 
  • Indramovie 
  • Shankardadambbs 
  • Marutinagarsubramanyam 
  • Kalki2898ad 
  • Terrortuesday 
  • Rayaan 

Similar News

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

Copyright @2026

Powered by Blink CMS