ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టు రానట్లేనా? తప్పెవరిది?

ఇప్పుడు అలాంటి పరిస్థితి ఓ నిర్మాత ఎదుర్కొంటున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.

Update: 2026-06-12 14:30 GMT

సినిమా ఇండస్ట్రీలో కొన్ని ప్రాజెక్టులు ప్రకటించినప్పటి నుంచే స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తాయి. హీరో ఎవరు? దర్శకుడు ఎవరు? కథ ఎలా ఉండబోతోంది? అనే ఆసక్తి ప్రేక్షకుల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా ఓటీటీ సంస్థల కోసం రూపొందే ఒరిజినల్ ప్రాజెక్టులపై మరింత ఆసక్తి నెలకొంటుంది. అయితే ఇప్పుడు అలాంటి ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ గురించే జోరుగా చర్చ సాగుతోంది. ఆ సినిమా పూర్తవుతుందా? అసలు ఆ పరిస్థితికి కారణం ఎవరు? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ఓ యంగ్ హీరో, యువ దర్శకుడి కాంబినేషన్‌ లో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ కోసం ప్రత్యేకంగా ఓ ప్రాజెక్ట్ కొన్ని రోజుల క్రితం ప్రారంభమైంది. కొత్త తరహా స్టోరీతో ఆ చిత్రాన్ని రూపొందించాలని భావించినట్లు తెలుస్తోంది. ఆ ప్రాజెక్టుపై నమ్మకంతో సదరు ఓటీటీ సంస్థ నిర్మాతకు ముందుగానే భారీ మొత్తాన్ని చెల్లించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. షూటింగ్ కూడా ప్రారంభమై కొంత భాగం పూర్తయిందని సమాచారం.

అయితే ఆ తర్వాత పరిస్థితులు అనుకున్నట్లు సాగలేదని తెలుస్తోంది. షూటింగ్ షెడ్యూల్స్ వరుసగా వాయిదా పడుతూ వచ్చాయని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే చిత్రీకరణ మొదలవుతుందని పలుమార్లు చెప్పినా, అది జరగలేదని వార్తలు వస్తున్నాయి. దీంతో ప్రాజెక్టుపై డౌట్లు మొదలయ్యాయి. అదే సమయంలో సినిమా అప్టేట్లపై ఓటీటీ సంస్థ ఆరా తీసినట్లు సమాచారం. షూటింగ్ ఎక్కడి వరకు వచ్చింది? మిగిలిన పనులు ఎప్పుడు పూర్తవుతాయి? అనే విషయాలపై నిర్మాతను ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

దీనికి నిర్మాత కొత్త షెడ్యూల్ తేదీలను చెప్పినట్లు ప్రచారం జరిగింది. అయితే ఆ తేదీల్లోనూ షూటింగ్ జరగలేదని తెలుస్తోంది. దీంతో అసలు సమస్య ఎక్కడ వచ్చిందనేది హాట్ టాపిక్ గా మారింది. హీరో డేట్స్ అందుబాటులో లేకపోవడమే కారణమా? ఇప్పటికే ఇతర సినిమాలతో బిజీగా ఉన్న హీరో ఈ ప్రాజెక్ట్‌కు సమయం కేటాయించలేకపోయారా? లేక నిర్మాత సరైన ప్రణాళికతో ముందుకు వెళ్లలేదా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

మరోవైపు దర్శకుడి రోల్ పై కూడా చర్చ జరుగుతోంది. కథలో మార్పులు జరిగాయా? షూటింగ్ ప్లానింగ్‌ లో ఇబ్బందులు ఎదురయ్యాయా? అనే డౌట్స్ వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిపై కూడా క్లారిటీ లేదు. ఇప్పటికే ఆ ప్రాజెక్ట్ కోసం భారీ మొత్తాన్ని చెల్లించిన ఓటీటీ సంస్థ కూడా పరిస్థితిని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాను పూర్తి చేసి అందించాలనే ఒత్తిడి పెడుతుందా? లేక పెట్టుబడుల విషయంలో లెక్కలు అడుగుతోందా? అన్నది ఆసక్తికరంగా మారింది.

దీంతో నిర్మాతపై బాధ్యత మరింత పెరిగినట్లు వినికిిడి. అయితే ఆ వ్యవహారంపై హీరో, నిర్మాత, దర్శకుడు లేదా ఓటీటీ సంస్థ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం నెట్టింట జరుగుతున్న ప్రచారం ఆధారంగానే చర్చ కొనసాగుతోంది. మంచి అంచనాలతో మొదలైన ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు అనుమానాలకు సెంటర్ పాయింట్ గా మారడం గమనార్హం. అసలు తప్పు హీరోదా? నిర్మాతదా? దర్శకుడిదా? లేక కమ్యూనికేషన్ లేకపోవడమే పరిస్థితికి కారణమా? అనే ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది. మరేం జరుగుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News