ఓటీటీలు.. మరీ ఎక్కువైతే ఇలాగే ఉంటుందేమో!

ఓటీటీలకు ఉన్న క్రేజ్ ఒకప్పుడు వేరు.. ఇప్పుడు వేరు.. కోవిడ్ టైమ్ లో ఒక్కసారిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాయి;

Update: 2025-11-16 08:30 GMT

ఓటీటీలకు ఉన్న క్రేజ్ ఒకప్పుడు వేరు.. ఇప్పుడు వేరు.. కోవిడ్ టైమ్ లో ఒక్కసారిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాయి. అనేక మంది సబ్స్క్రిప్షన్ లు తీసుకున్నారు. ఇంట్లోనే చక్కగా కూర్చుని పాండమిక్ టైమ్ లో సినిమాలు చూసేశారు. ఆ తర్వాత కూడా వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కు బాగా అలవాటు పడిపోయారు సినీ ప్రియులు.

అంతేకాదు.. చాలా మంది థియేటర్స్ కు ఏం వెళ్తాం.. ఓటీటీలోనే చూద్దామని కూడా ఫిక్స్ అయ్యారు. అంతలా ఓటీటీలకు ఇప్పుడు క్రేజ్ ఉంది. ఎప్పుడు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు వస్తాయో.. ఎప్పుడు చూద్దామని వెయిట్ చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఓటీటీ నిర్వాహకులు.. కొత్త కంటెంట్ ను ప్రతీ వీక్ తీసుకొస్తున్నారు.

అందులో భాగంగా రీసెంట్ గా అనేక కొత్త సినిమాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ఆయా చిత్రాలు స్ట్రీమింగ్ లోకి వచ్చాయి. కానీ కొన్ని వారాలుగా ఓటీటీలో ట్రాఫిక్ ఎక్కువ అయిందని చెప్పాలి. బోలెడు సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. దీంతో ఓవర్ లోడ్ అయిందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.

ఎక్కువ సినిమాలు ఉండటంతో.. కేవలం థంబ్ నెయిల్స్ మాత్రమే చూసి సైలెంట్ అయిపోయారట అనేక మంది సినీ ప్రియులు, ఓటీటీ లవర్స్. ఎందుకంటే వారం వారం అనేక మంది సినిమాలను చూస్తున్నారు. కానీ ప్రతీ వారం బోలెడు చిత్రాలు.. స్ట్రీమింగ్ కు వచ్చేస్తుండడంతో చాలా మంది థంబ్ నెయిల్స్ మాత్రమే చూస్తున్నారట.

సాధారణంగా ఇలాంటి సమస్యలు థియేటర్స్ విషయంలో వచ్చేవి. అనేక సినిమాలు.. ఒకేసారి థియేటర్స్ లో రిలీజ్ అయితే చాలా మంది కొన్నింటిని మిస్ అవ్వడం కామనే. నచ్చిన సినిమాలు చూస్తారు.. కొన్ని వదిలేస్తారు. కానీ ఇప్పుడు ఓటీటీ విషయంలో కూడా అదే జరుగుతుంది. టైమ్ లేక కేవలం పోస్టర్స్ మాత్రమే చూస్తున్నారు సినీ ప్రియులు.

మొత్తానికి ఓటీటీల్లో కంటెంట్ మరీ ఎక్కువైతే అలాగే ఉంటుందేమోనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే సినిమాలు చూడాలంటే టైమ్ ఉండాలి. అప్పుడే అందరూ చూడగలరు. అలా అని ప్రతి మూవీని చూడలేరు. ఒకే వారంలో అన్ని ఓటీటీల నిర్వాహకులు కుప్పలు తెప్పలుగా సినిమాలను తీసుకొస్తే.. కొన్నింటికి మాత్రమే వ్యూస్ వస్తాయి. అన్నింటికీ రావాలంటే మాత్రం చాలా కష్టమనే చెప్పాలి.

Tags:    

Similar News