ఓర్రీ (X) రేఖ‌: ఇంట‌ర్నెట్‌ని షేక్ చేసిన జోడీ

ఓర్రీ ధ‌రించిన డిజైన‌ర్ డ్రెస్ ప్ర‌త్యేక‌తంగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఈ డ్రెస్ పై ఛాతి భాగంలో ల‌వ్ సింబ‌ల్ క‌ట్ చేసి ఉంది.;

Update: 2025-09-30 16:54 GMT

బాలీవుడ్ లో యువ‌క‌థానాయిక‌ల ఫేవ‌రెట్ కుర్రాడు ఒక‌రున్నారు.. అత‌డు ఎవ‌రో ప్ర‌త్యేకించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. అత‌డే ఓర్రీ అలియాస్ ఓర్హాన్ అవ్ర‌త‌మ‌ణి. త‌న‌వైన చిలిపి చేష్ట‌ల‌తో, ఫ్యాష‌న్ సెన్స్ తో స్టైల్ ఐకాన్ గా అత‌డి పేరు మార్మోగుతోంది. జాన్వీ, ఖుషి, స‌నాయ‌, సుహానా, అన‌న్య ఇంతమందికి అత్యంత స‌న్నిహితుడు అయిన ఓర్రీ.. సీనియ‌ర్ క‌థానాయిక‌ల‌తో కూడా అంతే చిల్లింగ్ గా ఉంటాడు. అత‌డు పార్టీలో ఉంటే చాలు అంద‌రూ చిందులే చిందులు.

ఇప్పుడు నిర్మాత‌ బోనీక‌పూర్ ఏర్పాటు చేసిన ఓ స్పెష‌ల్ పార్టీలో ఓర్రీ చేసిన సంద‌డి అంతా ఇంతా కాదు. అత‌డు పార్టీ వీడియోల్లో యూనిక్ లుక్ తో క‌నిపించాడు. ఓర్రీ ధ‌రించిన డిజైన‌ర్ డ్రెస్ ప్ర‌త్యేక‌తంగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఈ డ్రెస్ పై ఛాతి భాగంలో ల‌వ్ సింబ‌ల్ క‌ట్ చేసి ఉంది. అయితే ఓర్రీ లాంటి కుర్రాళ్లు క‌నిపిస్తే 70 ప్ల‌స్ రేఖ కూడా చ‌లించిపోయింది మ‌రి. ఓర్రీతో పాటు వెట‌ర‌న్ న‌టి రేఖ పార్టీలో ఫుల్ చిల్లింగ్ గా క‌నిపించిన వీడియో ఇప్పుడు వైర‌ల్ గా మారుతోంది. ఆ ఇద్ద‌రూ ఓచోట జంట‌గా నిల‌బ‌డి ఉన్న‌ప్పుడు కెమెరా ఫ్లాష్ లు మెరిసాయి. ఇది ఊహించ‌ని జోడీ! అంటూ అభిమానులు స‌ర‌దాగా కామెంట్ చేస్తున్నారు. ఈ జోడీ ఇంట‌ర్నెట్ ని బ్రేక్ చేసింది! అంటూ ఓర్రీ వ‌ర్సెస్ రేఖ జంట‌గా ఉన్న ఫోటోలను అభిమానులు షేర్ చేస్తున్నారు. క్లాసిక్ డే క‌థానాయిక‌తో ఓర్రీ వేషాలు ఇంట‌ర్నెట్ లో ప్ర‌జ‌ల హృద‌యాల‌ను గెలుచుకున్నాయి.

బాలీవుడ్‌లో హై-ప్రొఫైల్ పార్టీలలో ఓర్హాన్ అవ్ర‌త‌మ‌ణికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పార్టీల్లో ఫ‌న్ తో అత‌డు అంద‌రి మూడ్ ని సెట్ చేస్తాడు. అందుకే జూనియ‌ర్ సీనియ‌ర్ అనే తేడా లేకుండా ప్ర‌తి ఒక్క‌రూ అత‌డిని ఇష్ట‌ప‌డ‌తారు. ఇక ఈ వేడుక‌లో బోనీ క‌పూర్ చాక్లెట్ బోయ్‌లా కొత్త లుక్ తో క‌నిపించాడు. బాలీవుడ్ ఏజ్ లెస్ ప్రొడ్యూస‌ర్ గా అత‌డి రూపం పూర్తిగా మారిపోయి క‌నిపిస్తోంది. బోనీ డ్యాన్సులు చేస్తూ పార్టీని ఫుల్ గా చిల్ చేయ‌డం బ‌ట్ట‌త‌ల మాయ‌మ‌వ్వ‌డం మ‌రో కొస‌మెరుపు.

పార్టీలో రేఖ లుక్ ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. అల్టిమేట్ గ్లామర్ ఐకాన్ రేఖ ఫుల్ స్లీవ్ బ్లాక్ డ్రెస్ లో క‌నిపించింది. పెద్ద సైజు వైట్ ష‌ర్ట్ కాంబినేష‌న్ కూడా ఆక‌ట్టుకుంది. రేఖ తన సిగ్నేచర్ బోల్డ్ రెడ్ లిప్‌స్టిక్‌తో ఏజ్ లెస్ బ్యూటీగా క‌నిపించింది. 70 వ‌య‌సు రేఖ ఇండ‌స్ట్రీలో శాశ్వ‌త‌మైన ఏజ్ లెస్ క్వీన్ అని అంగీక‌రించి తీరాలి.

ఓర్రీ అలియాస్ ఓర్హాన్ అవత్రమణికి దేశ విదేశాల్లో భారీ స‌ర్కిల్ ఉంది. 2017లో కైలీ జెన్నర్‌తో అతని ఫోటో వైరల్ అయినప్పుడు అతడు తొలిసారి ప్రజల దృష్టిని ఆకర్షించాడు. ఓర్రీ వ్యాపారవేత్త జోర్జ్ అవత్రమణి - షానాజ్ అవత్రమణిల కుమారుడు. ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో స్పెషల్ ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.

Tags:    

Similar News