DSP కామెంట్స్.. 'ఊ అంటావా'ను కాపీ కొట్టింది వీరే..
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే.;
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. బన్నీ కెరీర్ ను ఏకంగా మలుపు తిప్పేసిందని చెప్పాలి. అయితే సినిమాలోని ఊ అంటావా సాంగ్ ఓ రేంజ్ లో హిట్ అయింది. అన్ని భాషల ఆడియన్స్ ను కూడా ఉర్రూతలూగించింది.
ముఖ్యంగా సాంగ్ లో సమంత డ్యాన్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కంపోజిషన్ వేరే లెవెల్ అని చెప్పాలి. ఇప్పటికే ఆ సాంగ్ ఎవర్ గ్రీనే. అంతలా పాట సక్సెస్ అయింది. అయితే రీసెంట్ గా దేవిశ్రీ ప్రసాద్ తన ఊ అంటావా మావ.. ఊ ఊ అంటావా మూవీ పాటను కాపీ కొట్టారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు చెందిన దిల్ రాజు డ్రీమ్స్ సంస్థ లాంచింగ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్ కు డీఎస్పీ హాజరయ్యారు. ఆ సమయంలో వేదికపై దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడారు. తాను ఐదు నిమిషాల్లో చెన్నైలో క్రియేట్ చేసిన ఊ అంటావా.. ఊహు అంటావా సాంగ్ ను ఇప్పుడు హాలీవుడ్ లో ఎవరో కాపీ కొట్టారని వ్యాఖ్యానించారు.
కానీ వాళ్ల మీద కేస్ వేయాలా, ఏం చేయాలా అని ఆలోచిస్తున్నట్లు తెలిపారు. అయితే మన తెలుగు సాంగ్ ను కాపీ కొట్టినందుకు గర్వంగా ఉందని వ్యాఖ్యానించారు. దీంతో ఒక్కసారిగా దేవిశ్రీ ప్రసాద్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చార్ట్ బస్టర్ సాంగ్ ను ఎవరు కాపీ కొట్టారబ్బా అని అంతా డిస్కస్ చేసుకుంటున్నారు.
అయితే ఊ అంటావా సాంగ్ ను కాపీ చేసింది హాలీవుడ్ వాళ్ళు కాదు.. తుర్కిష్ వాళ్లు అని ఇప్పుడు తెలుస్తోంది. టర్కీకి చెందిన ప్రముఖ పాప్ సింగ్ అతియే.. కొన్ని రోజుల క్రితం అన్లయినా.. అంటూ టర్కిష్ భాషలో ఓ ప్రైవేట్ సాంగ్ ను రిలీజ్ చేశారు. అది సేమ్ మన ఊ అంటావా సాంగ్ లానే ఉంది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
దీంతో సినీ ప్రియులు, నెటిజన్లు రెస్పాండ్ అవుతున్నారు. తెలుగు ఒరిజినల్ సాంగ్ అంటూ అన్లయినా సాంగ్ వీడియో కింద కామెంట్ పెడుతున్నారు. టాలీవుడ్ మ్యానియా.. డీఎస్పీ క్రియేషన్ అంటూ సందడి చేస్తున్నారు. తెలుగు పీపుల్ అటెండన్స్ అంటూ రచ్చ చేస్తున్నారు. మరికొందరు ఫేమస్ సాంగ్ ను కాపీ కొట్టారని విమర్శిస్తున్నారు. అయితే ఆ పాట ఏడు నెలల క్రితం రిలీజ్ అయింది. ఇప్పుడు దేవీ చెప్పడంతో వెలుగులోకి వచ్చింది.