సుజీత్ ఆ నాడి పట్టుకున్నాడు.. ఇక ఓజీ బొమ్మ బస్టర్
దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుుడు ఓజీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.;
దేశవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రియులను అలరించడమే పాన్ ఇండియా. ఈ స్థాయిలో సినిమాలు తీయడం రాజమౌళి ప్రారంభించారు. ఈయన తర్వాత అనేక మంది పాన్ఇండియా రేంజ్ లో సినిమాలు తీస్తున్నారు. సుకుమార్ పుష్ప, కేజీఎఫ్ సినిమాలు అలా వచ్చినవే. అయితే పాన్ఇండియా రేంజ్ లో సక్సెస్ అవ్వడం అంత ఈజీ కాదు. అలా ప్రయత్నించి చాలా మంది ఘోరంగా విఫలమయ్యారు. అంచనాలు తారా స్థాయిలో ఉన్నప్పుుడు.. రిస్క్ ఎక్కువగా ఉంటుంది.
బాహుబలి 2 తర్వాత ప్రభాస్ మొదటి చిత్రం సాహో. ఈ సినిమతో దర్శకుడు సుజీత్ కూడా పాన్ ఇండియా రంగంలోకి ప్రవేశించాడు. ఈ సినిమాకు ఫుల్ హైప్ వచ్చినప్పటికీ, అది అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ఊహించని రేంజ్ లో ఎదురుదెబ్బ తగిలేసరికి.. సుజీ కొంచెం గ్యాప్ ఇచ్చాడు. దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుుడు ఓజీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
ఈ సినిమాకు కూడా తొలి నుంచే హైప్ ఉండడంతో ఇది మోస్ట్ అవెయిటెడ్ సినిమాగా మారిపోయింది. దీని హైప్ తోనే సుజీత్ బలంగా తిరిగి పుంజుకున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం చుట్టూ భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇది టాలీవుడ్ లో ప్రాంతీయ కథలకు పూర్వ వైభవం తీసుకురావడంలో ఉపయోగపడుతుందని అభిప్రాయాలు ఉన్నాయి.
అయితే ఇటీవల సంవత్సరాలలో అనేక మంది స్టార్ హీరోలు, దర్శకులు పాన్ ఇండియా మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని ఆ స్థాయిలోనే సినిమాలు రూపొందించారు. ఈ క్రమంలో ప్రాంతీయ కథా బలంపై దృష్టి పెట్టడం, నేచరాలిటీని కలిగించడం మర్చిపోయారు. కానీ, సుజీత్ దీనిని గుర్తించినట్లు అనిపిస్తుంది.
OG తో అతను కళ్యాణ్ ని స్టైలిష్ గా ప్రజంట్ చేస్తున్నారు. హై- క్వాలిటీ విజువల్స్, ఫ్యాన్ సెంట్రిక్ స్టోరీ టెల్లింగ్ ను మిళితం చేస్తున్నాడు. ఈ స్మార్ట్ విధానం అయన విశ్వసనీయత, పరిశ్రమ దృష్టిని తన వైపునకు తిప్పుకోవడంలో సహాయపడుతుంది. సాహో ఫెయిల్యుర్ తర్వాత, సుజీత్ తెలివిగా తన స్థానాన్ని మార్చుకున్నాడు. OG బ్రాండింగ్ విజయం ఇప్పటికే అతన్ని సానుకూల దృష్టికి తీసుకువచ్చింది.