ఓజి ఇంట‌ర్వెల్.. త‌మ‌న్ బెస్ట్ అట‌

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా న‌టిస్తున్న సినిమాల్లో ఎక్కువ హైప్ ఉన్న సినిమా అంటే అంద‌రూ వెంట‌నే ఓజి పేరు చెప్పేస్తారు.;

Update: 2025-08-07 06:53 GMT

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా న‌టిస్తున్న సినిమాల్లో ఎక్కువ హైప్ ఉన్న సినిమా అంటే అంద‌రూ వెంట‌నే ఓజి పేరు చెప్పేస్తారు. టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమా అనౌన్స్‌మెంట్ నుంచే మంచి అంచ‌నాల‌ను క‌లిగించింది. ఓజి నుంచి రిలీజైన గ్లింప్స్ వ‌ల్ల ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామా అని ఆతృత ఆడియ‌న్స్ లో క‌లిగింది.

ఆలస్య‌మైన ఓజి

వాస్త‌వానికైతే ఓజి సినిమా ఇప్ప‌టికే రిలీజ‌వాల్సింది కానీ మ‌ధ్య‌లో ప‌వ‌న్ రాజ‌కీయాల్లో బిజీ అవ‌డంతో పాటూ ఎప్పుడో మొద‌లుపెట్టిన హ‌రిహ‌ర వీరమ‌ల్లును కూడా పూర్తి చేయడంతో ఈ సినిమా ఆల‌స్య‌మైంది. వీర‌మ‌ల్లు త‌ర్వాత ఓజి షూటింగ్ ను కూడా పూర్తి చేసిన ప‌వ‌న్ ఈ సినిమాను సెప్టెంబ‌ర్ 25న ద‌స‌రా కానుక‌గా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి రెడీ అవుతున్నారు.

ఇటీవ‌ల రిలీజైన ఓజి ఫ‌స్ట్ సింగిల్

షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ జ‌రుపుకుంటున్న ఈ సినిమా నుంచి రీసెంట్ గానే ఫైర్ స్టార్మ్ అనే ఫ‌స్ట్ లిరిక‌ల్ రిలీజ‌వ‌గా దానికి ఫ్యాన్స్ నుంచి విప‌రీత‌మైన రెస్పాన్స్ వ‌స్తోంది. కానీ నార్మ‌ల్ ఆడియ‌న్స్ కు మాత్రం ఆ సాంగ్ పెద్ద‌గా ఎక్క‌ద‌నే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఓజి ఆల్బ‌మ్ కు ది బెస్ట్ ఇస్తానంటూ ముందు నుంచి చెప్పుకొస్తున్న త‌మ‌న్ కు ఈ సినిమా విష‌యంలో చాలానే ప్రెజ‌ర్ ఉంది.

రీరికార్డింగ్ మొద‌లుపెట్టిన త‌మ‌న్

అయితే త‌మ‌న్ దాన్ని ప్రెజ‌ర్ లాగా కాకుండా బాధ్య‌త‌గా తీసుకుని ఓజికి ది బెస్ట్ అవుట్‌పుట్ ఇవ్వడానికి నానా ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ట. అందులో భాగంగానే ఓజి సినిమాకు రీరికార్డింగ్ ను మొద‌లుపెట్టారు త‌మ‌న్. తాజా స‌మాచారం ప్ర‌కారం, ఓజి ఇంట‌ర్వెల్ సీన్ కు త‌మ‌న్ ఇచ్చిన బీజీఎం సినిమా మొత్తానికే హైలైట్ గా నిలవ‌నుంద‌ని అంటున్నారు.

పూన‌కాలు గ్యారెంటీ

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వ‌డంలో బాగా పాపుల‌రైన త‌మ‌న్, ఓజి సినిమాకు మ‌రోసారి త‌న స‌త్తా చూపిస్తున్నార‌ని అంటున్నారు. ఇదే నిజ‌మైతే ప‌వ‌న్ ఫ్యాన్స్ కు ఓజి ఇంట‌ర్వెల్ పూన‌కాలు తెప్పించ‌డం ఖాయం. ఇక సినిమా విష‌యానికొస్తే ప్రియాంక అరుళ్ మోహ‌న్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ సినిమాను డీవీవీ ఎంట‌ర్టైన్మెంట్స్ బ్యాన‌ర్ లో దాన‌య్య భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే.

Tags:    

Similar News