అందుకే పవన్ ను అందరూ ఇష్టపడతారు
తాజాగా ఓ సందర్భంగా శ్రియా రెడ్డి ఓజి సినిమా వర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్ ను షేర్ చేసుకున్నారు.;
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి రీసెంట్ గా వచ్చిన హరి హర వీరమల్లు సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోవడంతో ఇప్పుడందరి దృష్టి ఓజి పైనే ఉంది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచే అందరికీ దీనిపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను ఓజి నుంచి వచ్చిన ప్రతీ కంటెంట్ పెంచుతూనే వచ్చింది.
సెప్టెంబర్ 25న రిలీజ్ కానున్న ఓజి
పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుండగా ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఫ్యాన్స్ వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఓజితో పవన్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో మరోసారి అర్థమవుతుందని ఆయన ఫ్యాన్స్ ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో వర్సటైల్ నటి శ్రియా రెడ్డి కీలక పాత్రలో కనిపిస్తున్న విషయం తెలిసిందే.
సెట్ లోని అందరూ ఎంతో అద్భుతం..
తాజాగా ఓ సందర్భంగా శ్రియా రెడ్డి ఓజి సినిమా వర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్ ను షేర్ చేసుకున్నారు. ఓజి సెట్ లోని వారందరూ ఎంతో అద్భుతంగా ఉన్నారని, నిర్మాతలు, డైరెక్టర్, మరియు చిత్ర యూనిట్ మొత్తం అద్భుతంగా ఉన్నారని, పవన్ సర్ చాలా మంచివారని, ఆయనెంతో గొప్ప వారని, ప్రజలు ఆయన్ని ఇష్టపడటంతో ఆశ్చర్యం లేదన్నారని, ఓజిలో తనతో పాటూ యాక్ట్ చేసిన కో యాక్టర్లందరూ ఎంతో టాలెంటెడ్ అని ఆమె చెప్పారు.
ఓజిలో చాలా ఇంటెన్స్ రోల్ చేశా
ఇక ఓజి సినిమాలో తన క్యారెక్టర్ గురించి చెప్తూ తన పాత్ర రియలిస్టిక్ గా ఉంటుందని, తన లుక్ తో పాటూ క్యారెక్టర్ కు మంచి ఇంపాక్ట్ ఉండటం వల్ల తన టాలెంట్ ను బయటపెట్టే ఛాన్స్ వచ్చిందని చెప్పుకొచ్చారు. తనకు డిఫరెంట్ గా ఉంటూ అడ్వెంచరస్ రోల్స్ లాగా ఉంటే ఇష్టమని చెప్పిన శ్రియా రెడ్డి, ఈ సినిమాలో తన పాత్రకు మంచి పేరు దక్కుతుందని అభిప్రాయ పడుతున్నారు. శ్రియా రెడ్డి మాటలు విన్న తర్వాత ఓజిలో ఆమె ఎలాంటి పాత్రలో కనిపించనున్నారా అనే ఆసక్తి ఆడియన్స్ లో ఎక్కువైపోయింది.