పవన్ OG.. సుజీత్ సతీమణి కంటతడి

ఫ్యాన్స్ మాత్రం సినిమాను చూసి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అదిరిపోయిందని సుజీత్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అదే సమయంలో సుజీత్ భార్య ప్రవళ్లిక ఎమోషనల్ అయ్యారు.;

Update: 2025-09-25 08:15 GMT

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా నటించిన ఓజీ సినిమా.. ప్రపంచ వ్యాప్తంగా నేడు రిలీజ్ అయిన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి ప్రీమియర్స్ పడగా.. గురువారం వరల్డ్ వైడ్ గా సినిమా విడుదలైంది. కొందరు పాజిటివ్ రివ్యూలు ఇస్తుంటే.. ఇంకొందరు నెగిటివ్ పాయింట్స్ చెబుతున్నారు. దీంతో సినిమా మిక్స్ డ్ బ్యాగ్ అని చెప్పాలి.

ముంబై బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా ఓజీ సినిమాను తెరకెక్కించిన సుజీత్ మాత్రం ప్రశంసలు అందుకుంటున్నారు. తన అభిమాన హీరోను ఎలా చూపించాలో బాగా ఫోకస్ పెట్టారని చెబుతున్నారు. యాక్షన్ ఎపిసోడ్లు.. ఎలివేషన్ సీన్లు బాగా తీశారని అంటున్నారు. కానీ కథలో కొత్తదనం మిస్ అయిందని అంటున్నారు.

ఫ్యాన్స్ మాత్రం సినిమాను చూసి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అదిరిపోయిందని సుజీత్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అదే సమయంలో సుజీత్ భార్య ప్రవళ్లిక ఎమోషనల్ అయ్యారు. బుధవారం రాత్రి ఓజీ ప్రీమియర్ షోను వీక్షించారు. హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్, అర్జున్ దాస్ తో క‌లిసి ప్రీమియ‌ర్ షోకు వెళ్లారు.

సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత.. కాస్త ఎమోష‌న‌ల్ అయ్యారు. క‌న్నీళ్లు కూడా పెట్టుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కథలో కొత్తదనం మిస్ అయిందని అంటున్నా.. సుజీత్ ను అంతా ప్రశంసిస్తుండడంతో.. ఆయ‌న స‌తీమ‌ణి ఎమోష‌న‌ల్ అయిన‌ట్లు ఉన్నారు.

ఇక సుజీత్ వైఫ్ విషయానికొస్తే.. ప్రవళ్లిక వృత్తి పరంగా హైదరాబాద్ లో టాప్ డెంటిస్ట్ అని తెలుస్తోంది. ఓ ఈవెంట్ లో ఇద్దరు పరిచయమయ్యారని సమాచారం. ఆ తర్వాత ఫ్రెండ్స్ గా మారిన వారిద్దరూ.. లవ్ లో పడినట్లు టాక్. అయితే సుజీత్ ఫస్ట్ మూవీ రన్ రాజా రన్ తీసే టైమ్ కు వారిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ గా ఉన్నారట.

ఆ తర్వాత తన మనసులోని మాట చెప్పి ఆమెకు ప్రపోజ్ చేశారని సమాచారం. దీంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మూడేళ్ల పాటు ప్రేమించుకున్నారు. 2020లో ఇరు కుటుంబాలను ఒప్పించి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాతే ప్రభాస్ తో సాహో సినిమా తీసిన సుజీత్.. ఇప్పుడు పవన్ తో ఓజీ మూవీ రూపొందించారు. మరి నెక్స్ట్ ఏం చేస్తారో చూడాలి.

Tags:    

Similar News