వీరమల్లుకి అలా.. OGకి ఇలా ఎందుకు..?
మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా విషయంలో పవర్ స్టార్ ఫ్యాన్స్ అయితే ఆకాశమే హద్దు అనే రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నారు;
మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా విషయంలో పవర్ స్టార్ ఫ్యాన్స్ అయితే ఆకాశమే హద్దు అనే రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నారు. ఓజీ సినిమా 25న రిలీజ్ అయితే 24 స్పెషల్ ప్రీమియర్స్ అనౌన్స్ చేశారు. ఎప్పుడు కూడా ఏదైనా స్టార్ సినిమా రిలీజ్ అంటే చాలు యూఎస్ లో ప్రీమియర్స్ పడి ఆ టాక్ మన దాకా వచ్చేది. కానీ ఈసారి మన దగ్గరే మొదటి షోస్ పడుతున్నాయి. తెలుగు రెండు రాష్ట్రాల్లో ఈరోజు రాత్రి 10 గంటలకు షోస్ ప్లాన్ చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ ప్రమోషనల్ ఇంటర్వ్యూస్..
ఐతే ఓజీ సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా మొన్న ఎల్బీ స్టేడియంలో పవన్ కళ్యాణ్ స్పీచ్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ ఇచ్చింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లినా సరే ఓజీ ఓజీ అంటుంటారు. ఇక ఓజీ ఫంక్షన్ కాబట్టి ఫ్యాన్స్ అరుపులకు ఊతం అందిస్తూ పవన్ కళ్యాణ్ కూడా ఊగిపోయాడు. ఐతే ఓజీ సినిమాకు పవన్ కళ్యాణ్ ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ ఇస్తాడని అంతా అనుకున్నారు. కానీ అది కుదరలేదు.. ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ ప్లాన్ చేసినా కూడా పవన్ కళ్యాణ్ కి వైరల్ ఫివర్ ఉండటం వల్ల అది కుదరలేదు.
పవన్ కళ్యాణ్ రీసెంట్ రిలీజ్ హరి హర వీరమల్లు సినిమాకు పవన్ కళ్యాణ్ రిలీజ్ రెండు రోజులు ముందు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ ఇచ్చారు. ప్రింట్, ఎలెక్ట్రానిక్, వెబ్ అన్నిటికీ పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూస్ వైరల్ అయ్యాయి. వీరమల్లుని పవన్ కళ్యాణ్ భుజాన వేసుకుని ప్రమోట్ చేశారు. కానీ ఓజీ సినిమాను అలా చేయట్లేదు. ఐతే వీరమల్లు సినిమాకు పవన్ ప్రమోషన్స్ అవసరం అయ్యాయి. కానీ ఓజీకి అది అవసరం లేదు.
గట్టిగా ఇంపాక్ట్ చూపించేలా..
ఓజీ సినిమాకు కూడా పవన్ కళ్యాణ్ వీరమల్లుకి చేసినట్టుగా ప్రమోషన్స్ చేస్తే మాత్రం ఆ లెక్క వేరేలా ఉండేదని ఫ్యాన్స్ అంటున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం తెలుగు రెండు రాష్ట్రాల్లో ఓజీ ఫీవర్ ఒక రేంజ్ లో ఉంది. ఫ్యాన్స్ అందరికీ పవర్ స్టార్ మాస్ ఫీస్ట్ ఖుషి చేస్తుందని అంటున్నారు. ట్రైలర్ చూస్తే ఇదేదో గట్టిగా ఇంపాక్ట్ చూపించేలా ఉందనిపించింది.
ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించిన ఓజీ సినిమాలో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మి విలన్ గా చేశాడు. సినిమాలో శీయా రెడ్డి కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటించారు. థమన్ మ్యూజిక్ ఓజీని ఒక రేంజ్ లో నిలబెట్టిందని పాటలు చూస్తేనే అర్ధమవుతుంది. ఇక సినిమాలో థమన్ మ్యూజిక్ తో ఎలాంటి విధ్వంసం చేశాడో చూడాలి.