సీరియల్ కిస్సర్ ఇమ్రన్ పెదవులకు బీమా?
లిప్ కేర్ ఉత్పత్తులతో పెదవుల తడి ఆరిపోకుండా కాంతివంతంగా కనిపించేందుకు సొల్యూషన్ ఇస్తున్నాం! అంటూ ఒక ప్రకటనలో కనిపించాడు ఇమ్రాన్.;
`ఓజీ`లో విలన్‌గా నటించాడు ఇమ్రాన్ హష్మీ. ఇటీవల పవన్ తో పాటు హైదరాబాద్ లోని ఓజీ కాన్సెర్ట్ ప్రమోషన్స్ లోను పాల్గొన్న సంగతి తెలిసిందే. ప్రతినాయకుడు ఓమి పాత్రలో ఇమ్రాన్ నటన గురించి ఈ వేదికపై పవర్ స్టార్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు. ఈరోజు విడుదలైన `ఓజీ`లో ఇమ్రాన్ హష్మి లుక్, నటనకు ప్రశంసలు కురిసాయి.
అదంతా సరే కానీ ఇప్పుడు ఇమ్రాన్ హష్మి నటించిన ఓ ప్రకటన అభిమానుల్లో చర్చగా మారింది. పాపులర్ బ్రాండ్ కి చెందిన ఓ మాయిశ్చరైజర్ గురించిన ప్రకటన ఇది. లిప్ కేర్ ఉత్పత్తులతో పెదవుల తడి ఆరిపోకుండా కాంతివంతంగా కనిపించేందుకు సొల్యూషన్ ఇస్తున్నాం! అంటూ ఒక ప్రకటనలో కనిపించాడు ఇమ్రాన్.
ఈ ప్రకటనలో ఒక బీమా ఏజెంట్ ఛమత్కారం కూడా ఆకర్షిస్తుంది. అతడు వ్యాఖ్యానిస్తూ, ఐశ్వర్య రాయ్ కళ్ళు - అమితాబ్ బచ్చన్ గొంతుకు బీమా చేసారని, అలాగే సీరియల్ కిస్సర్ గనుక తన పెదవులకు బీమా చేయించుకోవాలని హష్మీకి ఏజెంట్ సూచిస్తాడు. ఎలాగైనా బీమా చేయించుకుని, అందమైన పెదవులను కాపాడుకోమని సూచించే ఏజెంట్ మాట విన్నాడా లేదా? అన్నది అటుంచితే, సీరియల్ కిస్సర్ కాబట్టి ఇమ్రాన్ హష్మి ఏజెంట్ చెప్పిన మాట వింటేనే మంచిదని పలువురు నెటిజనులు సూచిస్తున్నారు.
ఓజీకి పాజిటివ్ టాక్ వచ్చింది గనుక తొలి వీకెండ్ అద్భుత వసూళ్లు సాధిస్తుందని అంచనా ఉంది. దాదాపు 300 కోట్ల వసూళ్ల టార్గెట్ తో రిలీజైన ఈ చిత్రం మొదటిరోజు ఏకంగా 80కోట్లు వసూలు చేసిందని కథనాలొచ్చాయి. దీనిని బట్టి శని, ఆదివారాల్లో మరింతగా కలెక్షన్లు పెరిగేందుకు ఆస్కారం ఉందని అంచనా వేస్తున్నారు.