అదే జరిగితే ఓజి రికార్డులు ఖాయం
ఈ మధ్య ఓవర్ హైప్ తో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతుంటే, ఎలాంటి హైప్ లేకుండా వచ్చిన సినిమాలు మాత్రం సంచలనాలు సృష్టిస్తున్నాయి;
ఈ మధ్య ఓవర్ హైప్ తో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతుంటే, ఎలాంటి హైప్ లేకుండా వచ్చిన సినిమాలు మాత్రం సంచలనాలు సృష్టిస్తున్నాయి. ఆగస్ట్ లో వచ్చిన కూలీ, వార్2 సినిమాలకు రిలీజ్ కు ముందు ఎంత హైప్ వచ్చిందో అందరం చూశాం. కానీ ఆ రెండు సినిమాలు అంచనాలను అందుకోలేకపోయాయి. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన కింగ్‌డమ్ సినిమాకు కూడా రిలీజ్ కు ముందు భారీ హైప్ ఉంది. కానీ ఆ సినిమా కూడా హిట్ అవలేదు.
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ హీరోగా రాబోతున్న ఓజి సినిమా సిట్యుయేషన్ ఏంటని అందరూ ఎంతో ఎదురుచూస్తున్నారు. పవన్ ఇప్పటివరకు నటించిన సినిమాల్లో ఎక్కువ హైప్ తెచ్చుకున్న వాటిలో ఇది కూడా ఒకటి. సుజిత్ తో పవన్ సినిమా చేస్తున్నారని ఎప్పుడైతే అనౌన్స్‌మెంట్ వచ్చిందో అప్పట్నుంచే ఓజిపై అంచనాలు భారీగా ఉన్నాయి.
పవన్ కు సుజిత్ వీరాభిమాని
దానికి కారణం సుజిత్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అవడమే. ఫ్యాన్స్ పవన్ ను ఎలాగైతే చూడాలనుకుంటున్నారో సగటు అభిమానిగా సుజిత్ కు తెలుసు కాబట్టి, వారు కోరుకున్నట్టే సినిమా ఉంటుందని అందరూ ఆశించారు. వారి ఆశలు, అంచనాలకు తగ్గట్టే సుజిత్ ఎప్పటికప్పుడు ఓజి నుంచి ది బెస్ట్ ఇస్తూ వస్తున్నారు. ఓజి నుంచి ఇప్పటివరకు రిలీజైన ప్రతీ కంటెంట్ సినిమాపై ఆసక్తిని పెంచేలానే ఉంది.
ఎప్పుడూ ఓజిని వదిలింది లేదు
ఈ సినిమా కోసం సుజిత్ పడ్డ కష్టం ప్రతీ ఫ్రేములోనూ అర్థమవుతుంది. ఓజి కోసం పవన్ ఎంతో కాలంగా కష్టపడుతూనే ఉన్నారు. మధ్యలో పవన్ రాజకీయాల్లో బిజీ అయినప్పుడు కూడా సుజిత్ ఈ సినిమాను వదిలింది లేదు. సినిమాను ఇంకా బెటర్ గా ఎలా ప్రెజెంట్ చేయొచ్చని ఎప్పుడూ అదే ధ్యాస తో వర్క్ చేశారు తప్పించి ఎప్పుడూ ఓజిని పక్కన పెట్టింది లేదు.
గన్స్ అండ్ రోజెస్ తో ఫిదా చేసిన సుజిత్
ఆల్రెడీ ఓజి నుంచి వచ్చిన ప్రోమోలు, టీజర్లు, సాంగ్స్ తో పాటూ సుజిత్ పని తనం కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. రీసెంట్ గా వచ్చిన గన్స్ అండ్ రోజెస్ లిరికల్ వీడియోను సుజిత్ ప్రెజెంట్ చేసిన విధానానికి అందరూ ఫిదా అయ్యారు. కేవలం ప్రోమోలు, పాటలకే సుజిత్ ఈ రేంజ్ లో కేర్ తీసుకున్నారంటే ఇక సినిమాను ఏ రేంజ్ లో తీసి ఉంటారో అని ఫ్యాన్స్ అందరూ ఓజిపై తమ ఆశలను ఇంకా పెంచుకుంటూ ఎప్పుడెప్పుడు ఈ సినిమాను చూస్తామా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. సుజిత్ ప్రోమోలు, సాంగ్స్, టీజర్స్ పై పెట్టిన దృష్టి సినిమాపై కూడా పెట్టి ఉంటే ఓజి రికార్డులు సృష్టించడం ఖాయం. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.