OG గన్స్ అండ్ రోజెస్.. తమన్ మరో హై వోల్టేజ్ సాంగ్!
ఈ సాంగ్ రెగ్యులర్ ఎలివేషన్ సాంగ్స్‌ల్లా కాకుండా కొత్త స్టైల్లో ఉంది. తెలుగు, ఇంగ్లీష్ మిక్స్ చేసిన లిరిక్స్‌ను మిక్స్ చేసిన విధానం స్పెషల్ గా ఉంది.;
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఓజీ’ సినిమాపై అంచనాలు అయితే మాములుగా లేవు. పవర్ స్టార్ కెరీర్ లో నెవ్వర్ బిఫోర్ అనేలా బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను క్రియేట్ చేసే సినిమా ఓజీ అవుతుందని ట్రేడ్ వర్గాలు ధీమాగా చెబుతున్నాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.
ఇప్పటికే విడుదలైన ‘ఫైర్ స్టార్మ్’, ‘సువ్వి సువ్వి’ పాటలు ప్రేక్షకుల మన్నన పొందాయి. వీటిలో ఫైర్ స్టార్మ్ ట్రాక్ సోషల్ మీడియాలో రికార్డు స్థాయిలో ట్రెండ్ అవుతోంది. ఇటీవల విడుదలైన ‘ది ట్రాన్స్ ఆఫ్ ఓమీ’ సాంగ్ కూడా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలో తాజాగా విడుదలైన కొత్త సాంగ్ ‘గన్స్ అండ్ రోజెస్’ మాత్రం పూర్తిగా భిన్నమైన వైబ్‌ని అందించింది.
ఈ సాంగ్ రెగ్యులర్ ఎలివేషన్ సాంగ్స్‌ల్లా కాకుండా కొత్త స్టైల్లో ఉంది. తెలుగు, ఇంగ్లీష్ మిక్స్ చేసిన లిరిక్స్‌ను మిక్స్ చేసిన విధానం స్పెషల్ గా ఉంది. అద్వితీయ వోజ్జల పాటను రచించగా థమన్ హై వోల్టేజ్ బీట్స్‌తో దానికి కొత్త ఉత్సాహం తీసుకువచ్చారు. ముఖ్యంగా లిరికల్ వీడియోని యానిమేషన్‌తో డిజైన్ చేయడం కొత్తదనంగా అనిపించింది. హర్షా ఆలపించిన ఈ పాటలో ఇప్పటికే ఫస్ట్ గ్లింప్స్‌లో వినిపించిన ‘హంగ్రీ చీతా’ లైన్ కూడా ఉండటం ఫ్యాన్స్‌కి ఎక్సైటింగ్‌గా అనిపించింది.
ఇక థియేటర్స్‌లో ఇది ఎలా రిసీవ్ అవుతుందన్న ఆసక్తి మరింత పెరిగింది. థమన్ కంపోజ్ చేసిన మ్యూజిక్ ఈ సినిమాలో ఇప్పటికే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రతి సాంగ్ వేర్వేరు మూడ్‌లో ఉండగా, ‘గన్స్ అండ్ రోజెస్’ పాట పవన్ స్టైల్‌కి కొత్త వైభవం తీసుకువచ్చిందని అభిమానులు చెబుతున్నారు. ఫైర్ స్టార్మ్తో యాక్షన్ ఎనర్జీ పెంచితే, సువ్వి సువ్విలో రొమాంటిక్ వైపు చూపించారు. ఇప్పుడు ఈ కొత్త ట్రాక్ మాత్రం సినిమాకి మరో కలర్ జోడించింది.
డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్‌కు ప్రతినాయకుడిగా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ కనిపించనుండగా, ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రియారెడ్డి, అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, హరీష్ ఉత్తమన్ వంటి వారు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. భారీ బడ్జెట్, పాన్ ఇండియా రిలీజ్‌తో ఈ సినిమా ఇప్పటికే మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్‌కి టార్గెట్ అయ్యింది. ఇక బిగ్ స్క్రీన్ పై OG ఎలాంటి వైబ్ క్రియేట్ చేస్తుందో చూడాలి.