ఓజీ విలన్ కోసం సుజీత్ రీసెర్చ్ అదుర్స్
అయితే ఇప్పటి జనరేషన్ ప్రేక్షకులకు ఇమ్రాన్ అంటే పెద్దగా తెలియదు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ టైగర్- 3 సినిమా చూసినవాళ్లు ఇట్టే గుర్తు పడతారు.;
ఇటీవల పవన్ బర్త్ డే సందర్భంగా ఓజీ సినిమా నుంచి విలన్ ఇమ్రాన్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో పవన్ కళ్యాణ్ శ్వాగ్ తోపాటు, ఇమ్రాన్ హష్మీని కూడా చూపించారు. ఇందులో పవన్ ను చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. కానీ, విలన్ గా ఇమ్రాన్ హష్మీని నెగిటివ్ రోల్ గా తీసుకోవడంలో డైరెక్టర్ సుజీత్ ఎంతో తెలివి ప్రదర్శించారు. అది అభిమానులు గమనించట్లేదు.
అయితే ఇప్పటి జనరేషన్ ప్రేక్షకులకు ఇమ్రాన్ అంటే పెద్దగా తెలియదు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ టైగర్- 3 సినిమా చూసినవాళ్లు ఇట్టే గుర్తు పడతారు. అలా బాగా క్రేజ్ సంపాదించారు. కానీ, ఆయన ఈ మధ్య కాలంలో సినిమాలు బాగా తగ్గించేశాడు. ఇటీవల హీరోగా లీడ్ లో గ్రౌండ్ జీరో అనే హిందీ సినిమా చేశారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యింది. కానీ 35ఏళ్లు పైబడిన వాళ్లకు వాళ్లకు ఇమ్రాన్ హష్మీ క్రేజ్ ఏంటో బాగానే తెలిసి ఉంటుంది.
ఒకవేళ ఎవరికైనా తెలియని వాళ్లు ఉంటే.. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లి తెలుసుకోవాల్సిందే! 22ఏళ్ల కిందట అంటే 2003లో ఫుట్ పాత్ తో ఇండస్ట్రీలోకి వచ్చిన ఇమ్రాన్.. తన రెండో సినిమానే మర్డర్ తో ఒక్కసారిగా యూత్ లో సంచలనం అయ్యాడు. ఈ సినిమాలో మల్లికా శరావత్ తో ఇమ్రాన్ చేసిన రొమాన్స్ కు సపరేట్ ఫ్యాస్ బేస్ ఏర్పడింది. అప్పట్లో ఇది నేషనల్ హాట్ టాపిక్ అయ్యింది.
ఇక 2005లో ఆషిక్ బనాయా ఆప్నేలో తను శ్రీ దత్తాతో చేసిన హాట్ సాంగ్ ఇంకో లెవెల్. ఈ ఒక్క పాట కోసమే కుర్ర కారు థియేటర్లకు క్యూ కట్టారు. ఈ ఒక్క పాటే సినిమాపై కాసుల వర్షం కురిపించింది. ఆ తర్వాత నటనకు ప్రాధాన్యత ఉండే సినిమాలు చేశాడు. కానీ అవి పెద్దగా ఆకట్టుకోలేదు. ప్రేక్షకులకు ఇమ్రాన్ రొమాన్స్ హీరో గానే గుర్తు పెట్టుకున్నారు. గ్యాంగ్ స్టర్, వన్స్ అపాన్ ఏ టైం ఇన్ ముంబై, అవారాపన్ వంటి మంచి హిట్ సినిమాలు చేశాడు.
కాగా, 2010 తర్వాత ఇమ్రాన్ స్పీడ్ తగ్గించాడు. ఆ తర్వాత కెరీర్ లో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. అయితే అతడి మార్కెట్ పెద్దగా పెరిగింది లేదు. కానీ ఇప్పుడు విలన్ గా సెట్ అయ్యే స్టోరీ వస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ క్రమంలోనే ఓజీ చేస్తున్నాడు. అయితే పవన్ కు రెగ్యులర్ గా ఉన్న విలన్ లను పెడితే.. కొత్తదనం ఉండదని భావించిన సుజీత్ బాలీవుడ్ పై లుక్కేశాడు.
అందుకే ముంబై వెళ్లి మరీ పవన్ కు అపోజిట్ గా ఇమ్రాన్ హష్మీని ఒప్పించాడు. తాజాగా రిలీజైన గ్లింప్స్ తో ఫుల్ అంచనాలు పెరిగాయి. ఇమ్రాన్ పై క్రేజ్ కూడా పెరిగింది. అయితే ఓజీ సినిమా అంచనాలు అందుకొని భారీ విజయం సాధిస్తే.. సౌత్ లో ఇమ్రాన్ హష్మీకి మరిన్ని అవకాశాలు క్యూ కడతాయి. ఇక డిమాండ వస్తే రెమ్యూనరేషన్ కూడా హై రేంజ్ లోనే ఉంటుంది.