OG పాటకు క్లాసికల్ డాన్స్ తో అదరగొట్టేసిన అమ్మాయి.. వీడియో వైరల్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన మాస్ పర్ఫామెన్స్ మూవీ ఓ.జీ. ఎట్టకేలకు సెప్టెంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.;
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన మాస్ పర్ఫామెన్స్ మూవీ ఓ.జీ. ఎట్టకేలకు సెప్టెంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ముఖ్యంగా ఈ సినిమా అభిమానులకు మంచి మాస్ మసాలా వినోదాన్ని అందించింది అనడంలో సందేహం లేదు. ప్రముఖ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో.. ప్రకాష్ రాజ్ , శ్రేయ రెడ్డి, శుభలేఖ సుధాకర్ ఇలా తదితరులు కీలకపాత్రలు పోషించారు. బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హస్మి ఇందులో ఓమీ అనే విలన్ పాత్ర పోషించారు. తన పాత్రతో సినిమాకి మరింత పాజిటివ్ బజ్ తీసుకువచ్చిన విషయం తెలిసిందే.
నార్త్ నుంచి సౌత్ వరకు ప్రస్తుతం ఎక్కడ చూసినా సరే ఈ సినిమా మేనియా కొనసాగుతోంది. థియేటర్ ల ముందు అభిమానుల హడావిడి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఈ సినిమా ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో ఈ సినిమాలోని పాటలు కూడా ఇప్పుడు అంతే వైరల్ గా మారుతున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ అభిమానులైతే ఈ పాటలను వివిధ రూపాలలో ప్రదర్శిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గా మారడమే కాకుండా.. యూత్ కి పవన్ కళ్యాణ్ పై ఎంత క్రేజ్ ఉందో స్పష్టమయ్యేలా చేస్తోంది అంటూ వీడియో చూసిన నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.
అసలు విషయంలోకి వెళ్తే .. ఓజీ మూవీలో పవన్ కళ్యాణ్ ను ఇంట్రడ్యూస్ చేస్తూ రిలీజ్ అయిన "ఫైర్ స్ట్రోమ్" పాట అభిమానులలో ఏ రేంజ్ లో కిక్కెక్కించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇప్పుడు ఈ పాటకి ఒక అమ్మాయి క్లాసికల్ డాన్స్ చేస్తూ అదరగొట్టేసింది.. వీడియో గనుక మనం గమనిస్తే.. అది ఒక కాలేజ్ ప్రాంగణంలో తీసినట్టు అనిపిస్తోంది. అక్కడ వందలాదిమంది విద్యార్థుల నడుమ ఆ అమ్మాయి పవన్ కళ్యాణ్ ఓజీ ఫైర్ స్ట్రోమ్ సాంగ్ కి అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చి అందరిని ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ అమ్మాయి చేసిన క్లాసికల్ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అటు హంగ్రీ చీతా అంటూ మాస్ పర్ఫామెన్స్ తో సాగిన పాటకు ఆ అమ్మాయి అద్భుతంగా క్లాసికల్ డాన్స్ చేస్తూ స్టెప్పులతో అదరగొట్టేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారుతోంది.
సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా సీక్వెల్ ఉంటుందని మేకర్స్ సినిమా క్లైమాక్స్ లో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకి సీక్వెల్ కాదు.. ప్రీక్వెల్ ఉంటుందని తాజాగా డైరెక్టర్ సుజీత్ అభిమానులతో పంచుకున్నారు. మరి ప్రీక్వెల్ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుంది? ఇందులో ఎవరెవరిని తీసుకోబోతున్నారు? అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.