ఓజీ బిజినెస్.. ఆ ఏరియా రైట్స్ 20.80 కోట్లు?

OG సినిమాపై పవర్ స్టార్ ఫ్యాన్స్ లో అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.;

Update: 2025-08-26 12:54 GMT

OG సినిమాపై పవర్ స్టార్ ఫ్యాన్స్ లో అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హరిహర వీరమల్లు నిరాశపరిచినా OG పై బజ్ మాత్రం రోజు రోజుకు మరింత పెరుగుతోంది. దసరా కానుకగా సెప్టెంబర్ 25న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ సినిమా కోసం మేకర్స్ భారీ స్థాయిలో ప్లానింగ్ చేస్తున్నారు. ఇప్పటికే గ్లింప్స్, పోస్టర్స్, పాటలతోనే సినిమా మీద క్రేజ్ మరో లెవెల్‌లో ఉంది.

ఇక ఓజీ రిలీజ్ విషయానికి వస్తే.. ట్రేడ్ వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఈసారి పవన్ కళ్యాణ్ పూర్తిగా సోలో రిలీజ్‌గా బరిలోకి దిగుతున్నారు. పెద్ద సినిమాలు ఏవీ పోటీలో లేని పరిస్థితి ఉండటంతో, ఓజీకి పూర్తి స్థాయి స్క్రీన్స్ దొరకనున్నాయి. ఇది సినిమా బాక్సాఫీస్ వసూళ్లకు అదనపు బూస్ట్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూషన్ రైట్స్ పై ఇండస్ట్రీలో హాట్ టాక్ నడుస్తోంది. లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ ప్రాంత రైట్స్‌ను నిర్మాతలు రూ.20.80 కోట్ల (జీఎస్టీతో కలిపి) రేంజ్‌లో కోట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం పవన్ కళ్యాణ్ మార్కెట్ పవర్‌ను స్పష్టంగా చూపిస్తుంది. ఈ స్థాయి రేట్లు సాధారణ హీరోల సినిమాలకు అందవు. పవన్‌కి ఉన్న ఫ్యాన్ బేస్, ఓజీపై ఉన్న హైప్ ఈ రేంజ్ రైట్స్‌కు కారణమని ట్రేడ్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.

సినిమా విషయానికొస్తే.. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని డీవీవీ దానయ్య భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా కనిపించనున్నారు. అలాగే అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమాన్యు సింగ్, అజయ్ ఘోష్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఇప్పటికే విడుదల చేసిన బిట్స్‌తో మంచి రెస్పాన్స్ సంపాదించారు.

ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ఓజీ రికార్డు స్థాయి ఓపెనింగ్స్ సాధించే అవకాశం ఉంది. మొత్తం మీద ఓజీకి దేశవ్యాప్తంగా భారీ స్కేల్‌లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు ఈసారి రికార్డుల వర్షం కురిసేలా చూస్తారని ట్రేడ్ వర్గాల అంచనాలు. మరి సినిమా ఆ స్థాయిలో క్లిక్కవుతుందో లేదో చూడాలి.

Tags:    

Similar News