OG.. సాహో.. కలుస్తారా..?
స్టార్ డైరెక్టర్.. స్టార్ హీరో సినిమా అంటే చాలు దానికి పక్కా సీక్వెల్ ఉంటుంది అనిపించేలా బజ్ క్రియేట్ అవుతుంది.;
స్టార్ డైరెక్టర్.. స్టార్ హీరో సినిమా అంటే చాలు దానికి పక్కా సీక్వెల్ ఉంటుంది అనిపించేలా బజ్ క్రియేట్ అవుతుంది. అలా చేస్తేనే ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తార ఏంటన్న రేంజ్ లో సినిమాలు వస్తున్నాయి. కథ రాసుకున్నప్పుడు కాదు మధ్యలో సినిమా బాగా వస్తుంది అనుకున్నప్పుడు ఈ సీక్వెల్స్ ప్లాన్ చేస్తున్నారు. ఐతే వీటిలో మరో టైప్ ఏంటంటే సినిమాటిక్ యూనివర్స్. అంటే ఒక కథలో మరో చిన్న క్లూ ఇచ్చి నెక్స్ట్ సినిమాలో దాన్ని దీనికి యూనివర్స్ గా తీయడం. కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ ఖైదీ తీసేప్పుడు విక్రం తీయాలన్న ఆలోచన ఉందో లేదో కానీ విక్రం సినిమాలో ఖైదీ రిఫరెన్స్ తో బంపర్ హిట్ కొట్టాడు.
లోకేష్ సినిమాటిక్ యూనివర్స్..
విక్రం తర్వాత లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో రోలెక్స్, ఖైదీ 2 వస్తాయని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇదిలాఉంటే లేటెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా రిలీజైంది. ఈ సినిమా రిలీజ్ వరకు ఇది సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ అనే పాయింట్ బయటకు చెప్పలేదు. రిలీజ్ ముందు రోజు సుజిత్ యూనివర్స్ అని హింట్ ఇచ్చారు. సినిమాలో చూస్తే సమురాయ్ రోల్ ఉంది. జాకీ ష్రాఫ్ రోల్ ని చూపించి సర్ ప్రైజ్ చేశాడు.
అందులో పక్కన పిల్లాడిగా సాహోని చూపించారు. ఐతే ఆడియన్స్ లో అది ఎంతవరకు రిజిస్టర్ అయ్యిందో తెలియదు కానీ.. ఓజీ, సాహో కి లింక్ పెట్టే ఆలోచనలో ఉన్నాడు సుజిత్. అంతేకాదు ఓజీ ఎండ్ టైటిల్స్ లో ఓజీ 2 అని పోస్టర్ వేశారు. సో అందులో ఓజీ, సాహో ఇద్దరు కలుస్తారా.. ఇద్దరితో మల్టీస్టారర్ చేస్తాడా అనే డిస్కషన్ మొదలైంది.
ఓజీ టెక్నికల్ గా హై స్టాండర్డ్స్..
ఓజీ సినిమాలో సాహో రిఫరెన్స్ వాడటం. క్లైమాక్స్ లో ఓజీ 2 అనౌన్స్ చేయడం చూస్తుంటే సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ ప్లానింగ్ చాలా పెద్దగానే ఉన్నట్టు ఉంది. పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఓజీ అదిరిపోయే ట్రీట్ ఇస్తుండగా సినిమా స్టోరీ విషయంలో మాత్రం ఆడియన్స్ డిజప్పాయింట్ అయ్యారు. ఓజీ సినిమా స్టోరీ విషయంలో ఎలా ఉన్నా కూడా టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ తో వచ్చింది. ఓపెనింగ్ అయితే సినిమాకు మంచి బజ్ వచ్చింది. ఇక సుజిత్ నెక్స్ట్ ఓజీ 2 ఎలా ఉంటుంది.. దానిలో సాహో ఉంటాడా అన్నది ఎగ్జైటింగ్ గా ఉంది.
పవర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు ఓజీ చూసిన రెబల్ స్టార్ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఉన్నారు. ఓజీ 2 లో ప్రభాస్ కనిపిస్తాడా.. అసలే ప్రభాస్ కమిటైన సినిమాలు చాలా ఉన్నాయి కదా మళ్లీ ఈ సినిమా కూడానా అంటూ రెబల్ ఫ్యాన్స్ డిస్కషన్ పెడుతున్నారు. మరి సుజిత్ మాస్టర్ ప్లాన్ ఏంటో కానీ ఫ్యాన్స్ మాత్రం క్రేజీగా ఫీల్ అవుతున్నారు.