OG.. అది జరిగితే లెక్క వేరేగా ఉండేదేమో!
అనౌన్స్మెంట్ నుంచే సినిమాపై ఆడియన్స్ లో భారీ హైప్ క్రియేట్ అవ్వగా.. రిలీజ్ అయ్యాక ఫ్యాన్స్ ను మూవీ విపరీతంగా మెప్పించింది.;
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కొన్ని రోజుల క్రితం కూలీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఆ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించారు. ఆగస్టు 14వ తేదీన వరల్డ్ వైడ్ గా విడుదలైంది చిత్రం.
రిలీజ్ కు ముందు ఆడియన్స్ లో భారీ అంచనాలు క్రియేట్ అవ్వగా.. విడుదలయ్యాక మాత్రం అభిమానులనే మెప్పించింది. మిగతా మూవీ లవర్స్ ను సాటిస్ఫై చేయలేకపోయింది. అడ్వాన్స్ బుకింగ్స్ ఫుల్ జోష్ లో జరగడం వల్ల ఓపెనింగ్స్ భారీగా వచ్చాయి. కంప్లీట్ రన్ లో రూ.500 కోట్లకు పైగా వసూళ్లు నమోదయ్యాయి.
ఇక రీసెంట్ గా టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఓజీ (They Call Him OG)తో థియేటర్స్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ తో గ్యాంగ్ స్టర్ డ్రామాగా సుజీత్ దర్శకత్వం వహించిన ఆ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య, కళ్యాణ్ నిర్మించారు. సెప్టెంబర్ 25వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ చేశారు.
అనౌన్స్మెంట్ నుంచే సినిమాపై ఆడియన్స్ లో భారీ హైప్ క్రియేట్ అవ్వగా.. రిలీజ్ అయ్యాక ఫ్యాన్స్ ను మూవీ విపరీతంగా మెప్పించింది. మిగతా సినిమా లవర్స్ ను అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద రూ.250 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మరికొద్ది రోజుల్లో రూ.300 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది.
అయితే ఈ రెండు సినిమాలు గ్యాంగ్ స్టర్ డ్రామాలుగానే రూపొందాయి. సెన్సార్ బోర్డు అధికారుల నుంచి ఏ సర్టిఫికెట్ అందుకున్నాయి. ఆ విషయంలో కూలీ మేకర్స్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించగా.. ఓజీ మేకర్స్ మాత్రం అదే సర్టిఫికెట్ తో రిలీజ్ చేశారు. దీంతో అందరూ సినిమాలను థియేటర్స్ లో అవకాశం లేకుండా పోయింది.
సెన్సార్ అధికారులు ఏ రేటింగ్ ఇస్తే.. ఫ్యామిలీ ఆడియన్స్ ఆయా సినిమాలను చూసేందుకు వెనకాడుతుంటారు. అలా ఇటీవల కాలంలో ఏ రేటింగ్ వచ్చినా కూడా వివిధ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టాయి. కానీ కొందరు హీరోల సినిమాలు.. ముఖ్యంగా స్టార్ హీరోలు నటించిన చిత్రాలపై ఏ సర్టిఫికెట్ ఎఫెక్ట్ పడుతోంది.
అప్పుడు కూలీ మూవీ విషయంలో అదే జరగ్గా.. ఇప్పుడు ఓజీ సినిమా కూడా అలాగే జరుగుతున్నట్లు కనిపిస్తోంది. కాబట్టి రెండు సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ ఇంకా స్ట్రాంగ్ గా ఉంటే వచ్చి ఉంటే పరిస్థితి వేరేలా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. కచ్చితంగా బాక్సాఫీస్ వద్ద లెక్కలు మారేవని చెప్పాలి.