ఎన్టీఆర్ ప్లాన్స్ ఎలా ఉన్నాయంటే!

తారక్ సినిమాల లైన్ అప్ చూసుకుంటే మొదటిగా దేవర మూవీ కనిపిస్తోంది.

Update: 2024-05-05 04:15 GMT

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత ఏడాది గ్యాప్ తీసుకొని దేవర మూవీని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకి వచ్చింది. భారీ బడ్జెట్ తో ఈ మూవీ నిర్మాణం జరుగుతోంది. దేవర సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో తన మార్కెట్ ని పరీక్షించుకోవడానికి తారక్ రెడీ అవుతున్నాడు. తారక్ సినిమాల లైన్ అప్ చూసుకుంటే మొదటిగా దేవర మూవీ కనిపిస్తోంది. ఫిక్షనల్ జోనర్ లో కంప్లీట్ యాక్షన్ ప్యాక్డ్ కథతో ఈ సినిమా సిద్ధం అవుతోంది.

ఈ సినిమా అక్టోబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రెండు భాగాలుగా దేవర తెరకెక్కుతూ ఉండగా అందులో మొదటి భాగం గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. దేవర మూవీ షూటింగ్ ఆగస్టు నాటికి కంప్లీట్ అవుతుందని తెలుస్తుంది. తారక్ హిందీలో వార్ 2 మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మరో లీడ్ రోల్ చేస్తున్నారు.

ఇండియన్ బిగ్ స్క్రీన్ పై అతిపెద్ద మల్టీస్టారర్ మూవీగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే తారక్ తన పోర్షన్ కి సంబంధించిన షూటింగ్ మొదలుపెట్టారు. సెప్టెంబర్ కి ఎన్టీఆర్ తనకు సంబంధించిన అన్ని సీక్వెన్స్ కంప్లీట్ చేస్తారంట. 2025 ఆగస్టు 14న వార్ 2 మూవీ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. ఈ సినిమాతో తారక్ బాలీవుడ్ లో కూడా తనకంటూ మార్కెట్ క్రియేట్ చేసుకునే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Read more!

దీని తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ మూవీ స్టార్ట్ కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. నవంబర్ లేదా డిసెంబర్ లలో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. ఇలా వరుసగా మూడు భారీ ప్రాజెక్టులను తారక్ చేతులు పెట్టుకున్నారు.

వీటి తర్వాత దేవర 2, ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ సీక్వెల్ కూడా ఉంటాయని తెలుస్తోంది. అలాగే యష్ రాజ్ ఫిలిమ్స్ నుంచి తారక్ సోలోగా ఒక స్పై థ్రిల్లర్ మూవీ ఉండే అవకాశాలు ఉన్నాయని సమాచారం. సౌత్ ఇండియాలో మరి కొంతమంది స్టార్ డైరెక్టర్లు జూనియర్ ఎన్టీఆర్ తో సినిమాలు చేయడం కోసం లైన్ లో వెయిట్ చేస్తున్నారు.

Tags:    

Similar News