ఎన్టీఆర్ వస్తుంటే వెనక్కి తగ్గక తప్పదు..!

RRR తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమాగా దేవర మీద భారీ అంచనాలు ఉన్నాయి

Update: 2024-05-01 04:06 GMT

RRR తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమాగా దేవర మీద భారీ అంచనాలు ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్నారు. సైఫ్ అలి ఖాన్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అనిరుద్ రవిచంద్రన్ అద్భుతమైన మ్యూజిక్ అందిస్తున్నట్టు తెలుస్తుంది. దేవరను ముందు ఒక సినిమాగా రిలీజ్ చేయాలని అనుకోగా ఇప్పుడు సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు.

దేవర 1 అక్టోబర్ 10న దసరా కానుకగా రిలీజ్ ఫిక్స్ చేశారు. దసరా పండుగ టైం లో కామన్ గా అయితే పోటీగా స్టార్ సినిమాలు వస్తుంటాయి. కానీ ఎన్టీఆర్ దేవర సినిమాకు పోటీగా వచ్చేందుకు ఎవరు ఆసక్తి చూపించట్లేదు. సంక్రాంతి ఫెస్టివల్ టైం లో స్టార్స్ మధ్య పోటీ తెలిసిందే. దసరాకి అదే రేంజ్ పోటీ ఉంటుందని అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ దేవర మాత్రం కన్ఫర్మ్ అవ్వగా మిగతా సినిమాలు ఏవి ఫిక్స్ చేయలేదు.

తెలుగు పరిశ్రమ నుంచి మంచు విష్ణు కన్నప్ప మాత్రమే దసరా బరిలో ఉంటుందని చెబుతున్నారు. ఎన్టీఆర్ కు పోటీ ఎందుకని కన్నప్ప ని కూడా తప్పించే ఛాన్స్ ఉంటుంది. మాస్ మహరాజ్ రవితేజ మిస్టర్ బచ్చన్ దసరాకి రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ వేటయ్యన్ కూడా దసరాకి రిలీజ్ అంటున్నారు.

Read more!

జూన్ లో కల్కి 2898 ఏడి, ఆగష్టులో పుష్ప 2 వస్తుండగా అక్టోబర్ ఎండింగ్ లో నాని సరిపోదా శనివారం, సెప్టెంబర్ 27న పవన్ కళ్యాణ్ ఓజీ వస్తున్నాయి. ఇక మిగతా సినిమాలన్నీ నవంబర్ డిసెంబర్ లో రానున్నాయి. బాలయ్య 109వ సినిమా దసరా బరిలో ఉండే ఛాన్స్ లేదు. సో ఎలా చూసినా సరే దేవర ఒక్కటే రిలీజ్ అయ్యే పరిస్థితి కనబడుతోంది.

ఎవరు వచ్చినా ఎలా వచ్చినా ఎన్టీఆర్ దేవర తో పోటీ పడటం కష్టమని చెబుతున్నారు. RRR తో తనకు వచ్చిన గ్లోబల్ రేంజ్ ఫాలోయింగ్ ని మ్యాచ్ చేసేలా దేవర కోసం ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపిస్తున్నాడని తెలుస్తుంది. సినిమాకు హీరోగానే అన్నట్టు కాకుండా అన్ని విధాలుగా సినిమా అవుట్ పుట్ బాగా వచ్చేందుకు ఎన్టీఆర్ కృషి చేస్తున్నాడని తెలుస్తుంది.

Tags:    

Similar News