తారక్ 'వార్-2'.. ఆదిపురుష్ కన్నా కూడా తక్కువ?

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్.. రీసెంట్ గా వార్-2 మూవీతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.;

Update: 2025-08-19 06:41 GMT

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్.. రీసెంట్ గా వార్-2 మూవీతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఆ సినిమాలో గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ తో కలిసి కీలక పాత్ర పోషించారు. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందిన ఆ మూవీలో విక్రమ్ గా కనిపించారు.

ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ మూవీతో నార్త్ లో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న తారక్.. వార్-2తో సోలోగా భారీ హిట్ కొడతారని అంతా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అనుకున్నట్లు ఏం జరగలేదు. సినిమా ఫస్ట్ షో నుంచే మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది. స్టార్ క్యాస్టింగ్ ఫ్యాక్టర్, అడ్వాన్స్ బుకింగ్స్ భారీ జరగడంతో సినిమాకు సాలిడ్ ఓపెనింగ్స్ వచ్చాయి.

లాంగ్ వీకెండ్, సెలవులు కలసి రావడంతో మంచి కలెక్షన్స్ సాధించాయి. కానీ వీక్ డేస్ స్టార్ట్ అయ్యాక వార్-2 వసూళ్లలో భారీ తేడా కనిపించింది. సోమవారం రూ.9 కోట్ల నికర వసూళ్ళు మాత్రమే సాధించినట్లు తెలుస్తోంది. దీంతో నష్టాలు రావడం పక్కా అని అంతా కామెంట్లు పెడుతున్నారు. అదే సమయంలో ఆదిపురుష్ తో కంపేర్ చేస్తున్నారు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ లో నటించిన ఆ మూవీ డిజాస్టర్ గా మారింది. వసూళ్లు పర్లేదనిపించినా.. విమర్శలు, ట్రోల్స్ మాత్రం భారీగా వచ్చాయి. ఇప్పుడు తారక్ కు షాక్ తగిలినట్లే.. అప్పుడు ప్రభాస్ కు పెద్ద ఝలక్ తగిలింది. కానీ ఆ సినిమా అప్పట్లో ఫస్ట్ సోమవారం.. రూ.16 కోట్ల నికర వసూళ్లను సాధించడం గమనార్హం.

ప్రేక్షకులు, విమర్శకుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఆదిపురుష్ కలెక్ట్ చేసిన నెంబర్ ను కూడా ఇప్పుడు వార్-2 సాధించకపోవడంతో అంతా డిస్కస్ చేసుకుంటున్నారు. లాంగ్ రన్ తో పాటు బ్రేక్ ఈవెన్ టార్గెట్ పై ఇప్పుడు ప్రశ్నలను లేవనెత్తుతున్నాయని చెబుతున్నారు. బాలీవుడ్ లో మరో డిజాస్టర్ తప్పదా అని అంటున్నారు.

రామాయణ మహా కావ్యం ఆధారంగా బీ టౌన్ దర్శకుడు ఓం రౌత్.. ఆదిపురుష్ మూవీని తెరకెక్కించారు. ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా నటించారు. పేలవమైన వీఎఫ్ ఎక్స్ సహా అనేక విషయాల్లో తీవ్రంగా నిందించారు. ఇలా సినిమా తీస్తారా అని మండిపడ్డారు. అలాంటి మూవీ కన్నా ఇప్పుడు వార్-2 తక్కువ వసూళ్లు రాబట్టడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News