ఎన్టీఆర్, నాగార్జున.. ఇంట్రెస్టింగ్ ఫైట్..!

వార్ 2 లో తారక్, కూలీ లో నాగ్ ఇలా అనుకోకుండా ఇద్దరు నెగిటివ్ రోల్ చేయడం ఆ సినిమాలు ఒకేరోజు రిలీజ్ అవ్వడం జరుగుతుంది.;

Update: 2025-07-23 03:30 GMT

ఆగష్టు 14న మన టాలీవుడ్ హీరోలిద్దరి మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగబోతుంది. అదేంటి వార్ 2, కూలీ మధ్య ఫైట్ మన తెలుగు హీరోల మధ్య ఎందుకు అనుకుంటే.. అందులో మన స్టార్స్ నటించడమే దీనికి కారణమని చెప్పొచ్చు. వార్ 2 లో హృతిక్ రోషన్ తో మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. హృతిక్ రోషన్ ఓ పక్క ఎన్ టీ ఆర్ మాస్ స్టామినా మరోపక్క వార్ 2 కి స్పెషల్ ఎట్రాక్షన్ కానున్నాయి. వార్ 2 సినిమా ఆగష్టు 14న రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగిటివ్ రోల్ లో నటిస్తాడని టాక్.

ఇక అదే రోజు వస్తున్న సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీ సినిమాలో కూడా నెగిటివ్ రోల్ లో కింగ్ నాగార్జున నటిస్తున్నాడు. వార్ 2 లో తారక్, కూలీ లో నాగ్ ఇలా అనుకోకుండా ఇద్దరు నెగిటివ్ రోల్ చేయడం ఆ సినిమాలు ఒకేరోజు రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఆగష్టు 14 సినీ లవర్స్ అందరికీ కూడా ఒక స్పెషల్ ఫీస్ట్ అందించేలా ఈ మూవీస్ వస్తున్నాయి. నాగార్జున నటించడం వల్ల కూలీకి, తారక్ వల్ల వార్ 2 కి తెలుగు రెండు రాష్ట్రాల్లో సూపర్ బజ్ ఏర్పడింది.

లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేస్తున్న కూలీ సినిమాలో బ్యాడ్ గాయ్ గా నాగార్జున నటించాడు. ఆయన్ను ఒప్పించడం కోసం లోకేష్ దాదాపు 7 సార్లు కింగ్ కి కథ వినిపించాడట. నాగార్జున విలన్ గా చేయడం పెద్ద రిస్క్ అని అనిపిస్తున్నా లోకేష్ టేకింగ్ మీద నమ్మకం ఉంది కాబట్టే అక్కినేని ఫ్యాన్స్ రిలాక్స్ గా ఉన్నారు.

ఇక వార్ 2 లో ఎన్టీఆర్ నెగిటివ్ రోల్ అయినా ఆ సినిమాకు ఆ రోలే కథను మోసే పాత్ర సో కచ్చితంగా తారక్ బాలీవుడ్ లో కూడా అదరగొట్టే ఛాన్స్ ఉంది. ఎన్టీఆర్ నటించడం వల్ల వార్ 2 కి తెలుగులో సూపర్ బజ్ ఉంది. వార్ 2 సినిమాను తెలుగు రైట్స్ సితార నాగ వంశీ తీసుకున్నారు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇంకా ప్రమోషన్స్ కూడా భారీగా చేస్తారని టాక్. మొత్తానికి నాగార్జున, ఎన్టీఆర్ ల వల్ల వార్ 2, కూలీ సినిమాలకు తెలుగులో ఒక రేంజ్ లో క్రేజ్ ఏర్పడింది. ఐతే ఈ రెండు సినిమాల్లో ఏది వర్క్ అవుట్ అవుతుంది అన్నది చూడాలి.

Tags:    

Similar News