తారక్ తో పోటీ పడటానికి అతను ఒప్పుకుంటాడా?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇప్పుడు ఫుల్ బిజీలో ఉన్నారు. వరుస పెట్టి సినిమాలను చేస్తూనే మరోవైపు క్రేజీ లైనప్ ను రెడీ చేస్తున్నారు.;
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇప్పుడు ఫుల్ బిజీలో ఉన్నారు. వరుస పెట్టి సినిమాలను చేస్తూనే మరోవైపు క్రేజీ లైనప్ ను రెడీ చేస్తున్నారు. దేవర సక్సెస్ తర్వాత వార్2 సినిమాను పూర్తి చేసిన ఎన్టీఆర్, ఇప్పుడు ఓ వైపు వార్2 సినిమాను రిలీజ్ కు రెడీ చేస్తూనే మరోవైపు కెజిఎఫ్, సలార్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే.
వచ్చే ఏడాది ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఈ సినిమాలో ఎన్టీఆర్ మునుపెన్నడూ చూడని విధంగా కనిపించనున్నారని చిత్ర యూనిట్ ఊరిస్తూ ఉంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలు రిలీజవక ముందే ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ గురించి ఇప్పుడు తెగ డిస్కషన్స్ జరుగుతున్నాయి.
ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నారని ఇప్పటికే టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ నాగవంశీ రీసెంట్ గా వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ సినిమా సుబ్రహ్మణ్య స్వామి కథ నేపథ్యంలో ఉంటుందని కూడా వంశీ క్లారిటీ ఇవ్వగా, రీసెంట్ గా ఎన్టీఆర్ ఎయిర్‌పోర్టులో దానికి సంబంధించిన బుక్ తో కనిపించి వంశీ చెప్పిన విషయాన్ని కన్ఫర్మ్ చేశారు.
అయితే ఇప్పుడు ఎన్టీఆర్- త్రివిక్రమ్ సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఈ సినిమాలో విలన్ గా టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు రానా దగ్గుబాటిని తీసుకోవాలని నిర్మాత నాగవంశీ ప్రయత్నిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. తారక్ తో పోటీ పడే పాత్రలో రానా అయితే సరిగ్గా సరిపోతారని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట. ఇప్పటికే పలు సినిమాల్లో విలన్ గా నటించిన రానా మరి ఎన్టీఆర్ తో పోటీ పడేందుకు ఒప్పుకుంటారా లేదా అన్నది చూడాలి.