ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని టెన్షన్ లో పెట్టేశారుగా..?
దేవర తో లాస్ట్ ఇయర్ బాక్సాఫీస్ పై తన మార్క్ చూపించడానికి వచ్చిన ఎన్టీఆర్ కమర్షియల్ గా వర్క్ అయినా రికార్డులను క్రియేట్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు.;
దేవర తో లాస్ట్ ఇయర్ బాక్సాఫీస్ పై తన మార్క్ చూపించడానికి వచ్చిన ఎన్టీఆర్ కమర్షియల్ గా వర్క్ అయినా రికార్డులను క్రియేట్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. అందుకే ప్రశాంత్ నీల్ తో అసలు సిసలైన మాస్ సినిమా ఎలా ఉంటుందో చూపించడానికి వస్తున్నాడు. ఎన్టీఆర్, నీల్ కాంబినేషన్ మూవీ పై అంచనాలు నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. సినిమా ఇప్పటివరకు జరిగిన రష్ చూసి మేకర్స్ కూడా సూపర్ హ్యాపీగా ఉన్నారట. ఎన్టీఆర్ లోని మాస్ యాంగిల్ ని ప్రశాంత్ నీల్ ఫుల్ గా వాడేస్తున్నాడని తెలుస్తుంది.
నిర్మాత ఇలా చెప్పేసరికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ షాక్..
ఎన్టీఆర్, నీల్ సినిమాకు మొదటి నుంచి డ్రాగన్ టైటిల్ పరిశీలనలో ఉంది. దాదాపు ఆ సినిమా టైటిల్ అదే అని ఆడియన్స్ కూడా ఫిక్స్ అయ్యారు. నిర్మాతలు కూడా అదే ఫిక్స్ అని అనుకున్నారు. కానీ సడెన్ గా మైత్రి రవి శంకర్ మాట మార్చేసి షాక్ ఇచ్చారు. డ్రాగన్ టైటిల్ ఫైనల్ అవ్వలేదని మరో పవర్ ఫుల్ టైటిల్ పరిశీలనలో ఉందని రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పారు. సో అలా చూస్తే డ్రాగన్ టైటిల్ తో ఎన్టీఆర్, నీల్ సినిమా రావట్లేదని అర్ధమవుతుంది.
దాదాపు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా ఆ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ఫిక్స్ అనుకున్నారు. తీరా నిర్మాత ఇలా చెప్పేసరికి షాక్ అవుతున్నారు. డ్రాగన్ ని మించిన టైటిల్ ఆలోచన ఉండబట్టే దీన్ని పక్కన పెట్టి ఉండొచ్చని అంచనా ఉన్నా కూడా ఆ టైటిల్ ఏంటన్నది తెలిస్తే ఫ్యాన్స్ కూడా సాటిస్ఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్రశాంత్ నీల్ తన ప్రతి సినిమాకు టైటిల్ ని కూడా చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తాడు. కె.జి.ఎఫ్ 1 అండ్ 2 ఇంకా సలార్ సీజ్ ఫైర్ ఇలా టైటిల్స్ అదిరిపోతాయి.
ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రంతో..
ఇక ఎన్టీఆర్ సినిమాకు ఫైనల్ టైటిల్ ఏంటన్నది తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. రాబోతున్న క్రిస్మస్ లేదా సంక్రాంతికి తారక్ సినిమా అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉంది. ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రం తో సినిమా చేయాల్సి ఉంది. మైథాలజీ కథతో గురూజీ ఈసారి చాలా పెద్ద ప్లానింగ్ తోనే ఆ సినిమా చేయబోతున్నారని తెలుస్తుంది.
ఎన్టీఆర్ నీల్ మూవీ ఒక భాగంగా వస్తే నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ తో నీల్ సినిమా పూర్తవుతుంది అప్పుడే రిలీజ్ కూడా ఉంటుంది. ఇక దేవర 2 దాదాపు ఆగిపోయినట్టే అంటున్నారు కాబట్టి త్రివిక్రం తో సినిమాకే ఎన్టీఆర్ తనను తాను రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. తారక్ తో గురూజీ మురుగన్ కథతో వస్తారని టాక్.