డ్రాగన్ డబల్ ట్రీట్.. ఊర మాస్ ఎన్టీఆర్ ఏం చేస్తాడో..?

ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాను మాత్రం రెండు భాగాలుగా అది కూడా ఒకేసారి రెండు పార్ట్ లను షూట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట.;

Update: 2025-11-03 04:43 GMT

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో డ్రాగన్ సినిమా సెట్స్ మీద ఉంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సినిమాకు సంబంధించిన రెండు భారీ షెడ్యూళ్లు ఆల్రెడీ పూర్తయ్యాయి. ఐతే వస్తున్న అవుట్ పుట్ చూసి సినిమా ఫ్యాన్స్ కి ఫీస్ట్ పక్కా అనేలా ఉంటుందట. ఈ సినిమాను ముందు ఒక పార్ట్ గానే తీయాలని అనుకున్న మేకర్స్ ఇప్పుడు రెండు భాగాలుగా ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. సినిమాలో రెండు పార్ట్ లుగా తీసే స్టఫ్ ఉందని అంటున్నారు.

రెబల్ స్టార్ ప్రభాస్ తో సలార్..

ప్రశాంత్ నీల్ కె.జి.ఎఫ్ సినిమాను రెండు భాగాలు తీశాడు. ఆ సినిమా పార్ట్ 1 సైలెంట్ గా వచ్చి సూపర్ హిట్ అందుకోగా పార్ట్ 2 పై భారీ హైప్ ఉండగా దానికి తగినట్టుగానే ప్రశాంత్ నీల్ సత్తా చాటాడు. ఇక ఆ నెక్స్ట్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సలార్ సినిమా తీశాడు ప్రశాంత్ నీల్. ఐతే సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ కూడా ఫ్యాన్స్ ని మెప్పించింది. ఐతే సలార్ 2 శౌర్యాంగ పర్వం సినిమా అనౌన్స్ చేశారు కానీ అది సెట్స్ మీదకు వెళ్లలేదు.

ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాను మాత్రం రెండు భాగాలుగా అది కూడా ఒకేసారి రెండు పార్ట్ లను షూట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఒక భాగం వచ్చిన రెండేళ్ల తర్వాత మరో పార్ట్ అన్నట్టు కాకుండా డ్రాగన్ సినిమాను చాలా తక్కువ గ్యాప్ లోనే సినిమా రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారట. ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా కచ్చితంగా ఫ్యాన్స్ కి డబల్ ట్రీట్ ఇచ్చేలా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లినప్పటి నుంచి మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి డబల్ ట్రీట్..

ఐతే మేకర్స్ ఒక మంచి ముహూర్తం చూసి సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టాలని చూస్తున్నారు. ప్రశాంత్ నీల్ ఈ సినిమాపై భారీ బజ్ క్రియేట్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఆమె కూడా వన్ ఆఫ్ ది మేజర్ హైలెట్ అయ్యేలా ఉంటుందని అంటున్నారు.

K.G.F తో మాసివ్ హిట్ అది కూడా నేషనల్ లెవెల్ ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసిన ప్రశాంత్ నీల్ తారక్ తో ఊర మాస్ సినిమా చేయాలని చూస్తున్నాడు. డ్రాగన్ మీద ఫ్యాన్స్ ఎన్ని అంచనాలతో వచ్చినా వాటికి మించి సినిమా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. మరి అది ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News