2000 మంది మధ్యలో తారక్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ యాక్షన్ థ్రిల్లర్ గా 'డ్రాగన్' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.;
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ యాక్షన్ థ్రిల్లర్ గా 'డ్రాగన్' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. చిత్రీకరణలో ఎన్టీఆర్ సహా ప్రధాన పాత్ర ధారులంతా పాల్గొంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో భాగంగా ఎన్టీఆర్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. 2000 మంది జూనియర్ ఆర్టిస్టుల మధ్య లో తారక్ ఉన్న సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
దీంతో ఇది భారీ సన్నివేశమని తెలుస్తోంది. ఇంత మంది మధ్యలో తారక్ ఇంత వరకూ ఏ సినిమా కోసం పని చేయలేదు. గతంలో 'ఆర్ ఆర్ ఆర్' చిత్రీకరణలో పాల్గొన్నారు. ఆ సన్నివేశాల్లో వందల మంది మాత్రమే పాల్గొన్నారు. రెండు వేల మంది మధ్యలో సీన్స్ అంటే? ఈ సన్నివేశం ప్రత్యేకత హైలైట్ అవుతుంది. పీరియాడిక్ మాస్ యాక్షన్ కథతో కూడా సబ్జెక్ట్ కావడంతోనే భారీ కాన్వాస్ పై తెరకెక్కి స్తున్నారు.
ఈ సినిమా కోసం తారక్ బాగా సన్నబడిన సంగతి తెలిసిందే. శారీరకంగా చాలా మార్పులు తీసుకొచ్చాడు. మునుపటి కంటే మరింత సన్నరివ్వలా తయారయ్యాడు. అందుకోసం ప్రత్యేకమైన డైట్ ఫాలో అయ్యారు. దీంతో వెయిట్ లాస్ బాగా జరిగింది. ఈ నేపథ్యంలో తారక్ లుక్ ఎలా ఉంటుంది? అన్న దానిపై ఆసక్తి నెలకొంది. మీడియా కెమెరాల్లో కనిపించినా? డ్రాగన్ లుక్ ఎలా ఉంటుంది? అన్న దానిపై అంతకంతకు ఆసక్తి రెట్టింపు అవుతుంది.
ఫస్ట్ లుక్ పోస్టర్ కోసం ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. ఇందులో తారక్ కి జోడీగా కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ నటిస్తోంది. మరి ఈ సినిమాలోనైనా హీరో-హీరోయిన్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలకు డైరెక్టర్ చాన్స్ తీసుకుంటాడా? 'కేజీ ఎఫ్','సలార్' తరహాలోనే హీరోయిన్ పాత్రను పరిమితం చేస్తాడా? అన్నది చూడాలి. వచ్చే ఏడాది జూన్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.