• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తెలుగు రాష్ట్రాల‌కు యంగ్...

తెలుగు రాష్ట్రాల‌కు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కోటి విరాళం

| విజ‌య‌వాడ‌-గుంటూరు, తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు భారీ వ‌ర‌ద‌తో నీట మునిగిన సంగతి తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2024-09-03 05:38 GMT

విజ‌య‌వాడ‌-గుంటూరు, తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు భారీ వ‌ర‌ద‌తో నీట మునిగిన సంగతి తెలిసిందే. జ‌ల‌దిగ్భందంలో ప్ర‌జ‌ల ఆర్త‌నాదాలు కొన్ని రోజులుగా కొన‌సాగుతున్నాయి. ఇప్ప‌టికీ అదే ప‌రిస్థితి క‌నిపిస్తుంది. ఓవైపు యుద్ద ప్రాతిప‌దిక ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్టి ప్ర‌జ‌ల్ని ఆదుకుంటుంది. ఈ నేప‌థ్యంలో ఫిల్మ్ ఇండ‌స్ట్రీ నుంచి వారాళాలు మొద‌ల‌య్యాయి.


ఇప్ప‌టికే నిర్మాత అశ్వీనీద‌త్ 25ల‌క్ష‌లు విరాళంగా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సీఎం సహాయనిధికి జూనియర్ ఎన్టీఆర్ రూ.కోటి విరాళం ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.

‘రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో జరుగుతున్న వరద బీభత్సం నన్ను ఎంతోగానే కలిచివేసింది. అతి త్వరగా ఈ విపత్తు నుంచి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తు న్నాను.’ అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు నా వంతుగా చెరొక రూ.50 లక్షలు విరాళం ప్రకటిస్తున్నానని ఆయన తెలిపారు.

అలాగే టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ కూడా రెండు రాష్ట్రాలకు కలిపి రూ.10 లక్షల విరాళం ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా బాధితులకు నా వంతుగా సహాయం అంటూ పోస్ట్ చేశారు.`ఈ విపత్తు సమయంలో రాష్ట్రంలో నెలకొన్న వరదలకు సహాయక చర్యలు అవసరం. ఈ మేరకు తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.5 లక్షల విరాళం ఇస్తున్నా. వరద బాధితులకు నా వంతుగా ఈ సహకారం.’ అంటూ ట్వీట్ చేశారు.

మరో ట్వీట్‌లో ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయనిధికి రూ.5లక్షలు విరాళంగా ఇస్తున్నాను. వరదలతో నష్టపోయిన వారి బాధలను తగ్గించే దిశగా ఈ సహకారం ఒక చిన్న అడుగు.` అని పోస్టు చేశారు.అలాగే ‘ఆయ్’ మూవీ మేకర్స్ వారంతపు వసూళ్లలో 25 శాతాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందజేస్తున్నట్లు ప్రకటించారు.

In these devastating times of calamity, I am pledging a donation of ₹5 lakhs to the Telangana CM Relief Fund to support the flood relief efforts in the state. This contribution is a small step towards alleviating the suffering of those affected by the floods.@revanth_anumula…

— VishwakSen (@VishwakSenActor) September 3, 2024

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద భీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది. అతిత్వరగా ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.

వరద విపత్తు నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకి…

— Jr NTR (@tarak9999) September 3, 2024
Tags:    
  • Tollywoood 
  • Filmindustry 
  • Jrntr 
  • Devara 
  • Vishwaksen 
  • CMrelieffunds 
  • Telangana 
  • Andhrapradesh 

Similar News

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

Copyright @2026

Powered by Blink CMS