నోరా కిల్లింగ్ లుక్: కాసులు, నాణేలతో ఒళ్లంతా సింగారం
గ్లోబల్ డాన్సింగ్ సెన్సేషన్ నోరా ఫతేహి తన సరికొత్త ఫోటోషూట్‌తో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.
గ్లోబల్ డాన్సింగ్ సెన్సేషన్ నోరా ఫతేహి తన సరికొత్త ఫోటోషూట్‌తో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ''నీ ఒళ్లు బంగారం కాను..!'' అనేలా మెరిసిపోతున్న ఆ దివ్యమైన రూపం అభిమానుల కళ్లను తిప్పుకోనివ్వడం లేదు. భారతీయ సంప్రదాయ ఆభరణాలు... ఉత్తర ఆఫ్రికా సంస్కృతుల అరుదైన కలయికతో రూపొందించిన ఈ లుక్ నోరా కెరీర్‌లోనే అత్యంత ప్రయోగాత్మకమైన.. అందమైన ఫోటోషూట్‌లలో ఒకటిగా నిలుస్తోంది.
ఈ ఫోటోషూట్ వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం ఒక `జల దేవత` రూపానికి ప్రాణం పోయడం. ఇందులో భాగంగా నోరా శరీరం నిండా బంగారు కాసులు, నాణేలతో కూడిన ఆభరణాల దుస్తులను డిజైన్ చేయించడం ఆసక్తిని కలిగించింది. ఈ గోల్డ్ జ్యువెలరీ ఈ బ్యూటీకి ఒక రాజసం ఉట్టిపడే భారతీయ సౌందర్యాన్ని అందించింది. నోరా నిజంగా ఒక దేవతలా వెలిగిపోతోంది.
కేవలం భారతీయతకే పరిమితం కాకుండా.. ఈ లుక్‌లో నోరా తన మూలాలను కూడా ప్రతిబింబించింది. మొరాకోకు చెందిన `అమాజిగ్ బెర్బర్` సంస్కృతికి చెందిన బాడీ టాటూలను ఇందులో జోడించారు. ఈ టాటూలు, బంగారు ఆభరణాల కలయిక భారత్ - మొరాకో అనే రెండు భిన్నమైన ప్రపంచాల అద్భుతమైన సమ్మేళనంలా కనిపిస్తోంది. ఈ `ఫ్యూషన్` స్టైల్ నోరా ఫ్యాషన్ సెన్స్‌కు నిదర్శనంగా నిలుస్తోంది.
నోరా ఫతేహి తన ఫిట్‌నెస్ - గ్రేస్‌తో ఈ లుక్‌కు పూర్తి న్యాయం చేసింది. కేవలం డ్యాన్స్‌లోనే కాదు.. ఫ్యాషన్ ప్రయోగాల్లోను తనే `క్వీన్` అని చాటుకుంది. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ అవుతుండటంతో.. నెటిజన్లు నోరా అందానికి .. ఆ వినూత్న ఆలోచనకు ఫిదా అయిపోతున్నారు.