నోరా లెహంగా డిజైన్ కోసం 1400 గం.లు..!

అద్భుత‌మైన నృత్యం, అసాధార‌ణ‌మైన హావ‌భావాల‌తో మురిపించే నోరా ఫ‌తేహి దుబాయ్‌లో ఇనాయా అనే డిజైనర్ బ్రైడల్ కలెక్షన్ 2025/26ను ప్రదర్శించింది.;

Update: 2025-10-03 03:39 GMT

అద్భుత‌మైన నృత్యం, అసాధార‌ణ‌మైన హావ‌భావాల‌తో మురిపించే నోరా ఫ‌తేహి దుబాయ్‌లో ఇనాయా అనే డిజైనర్ బ్రైడల్ కలెక్షన్ 2025/26ను ప్రదర్శించింది. ర్యాంప్ పై నోరా గార్నెట్ లెహంగాలో అందరినీ ఆకర్షించింది. లెహంగాతో పాటు, ప్ర‌త్యేక‌మైన డిజైన‌ర్ నెక్లెస్‌తో అలంకరించుకుని చాలా ప్ర‌త్యేకంగా క‌నిపించింది.

ఈ లెహెంగా గురించి డిజైన‌ర్ మ‌నీష్ మ‌ల్హోత్రా అందించిన‌ వివరాలు ఆశ్చ‌ర్య‌ప‌రిచాయి. ఈ ఎంబ్రాయిడరీ లెహంగా చాలా అంద‌మైన పూలు, ప్రకృతి ప్రేరణతో రూపొందించిన‌ది. లెహెంగా అంతటా ఎంబ్రాయిడ‌రీ అందంగా కనిపిస్తుంది. ఇది బంగారం, వెండి దారాలలో జర్దోజీ పనితో రూపొందించిన‌ది. తీగలు, వికసించే పూల నమూనాలను రూపొందించడానికి రేషమ్ దారాలను ఉప‌యోగించారు. సీక్విన్స్, పూసలు, కట్ డానా మెరుపులు డిజైన్ లో ఉప‌యోగించాము.. అలాగే స్ప‌టికాల‌తో అలంక‌రించాము.. అని డిజైన‌ర్ తెలిపారు. ప్లంగింగ్ బ్లౌజ్ ఎంబ్రాయిడరీతో అలంకరించిన బ్లౌజ్ కూడా ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. అలాగే షీర్ మెరూన్ దుపట్టా బార్డ‌ర్ ఎంబ్రాయిడరీ మ‌రో ఆక‌ర్ష‌ణ‌.

పచ్చలు అద్దిన ఆభరణాలు పెళ్లిళ్ల‌ సీజన్ కోసం రూపొందించిన‌ది. నోరా పచ్చ వజ్రాల హై జ్యువెలరీ సెట్‌లో అద్భుతంగా కనిపించింది. మల్హోత్రా దీనిని డైమండ్ హాత్‌ఫూల్‌తో పాటు 200 క్యారెట్ల పచ్చలను జోడించారు. ఈ మొత్తం ప‌ని కోసం ఏకంగా 1200 గంట‌లు ప‌ని చేసామ‌ని మ‌నీష్ మ‌ల్హోత్రా వెల్ల‌డించ‌డం షాకిస్తోంది. నోరా ఫ‌తేహి ఇటీవ‌ల ప‌లు డ్యాన్స్ వెబ్ సిరీస్ ల‌కు ప‌ని చేస్తోంది. కొన్ని సింగిల్ ఆల్బ‌మ్స్ తోను అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

Tags:    

Similar News