ఘాటికే రాలేదు.. బాహుబలికి వస్తుందా అత్యాశనే..?
బాహుబలి రెండు భాగాలు కలిపి బాహుబలి ఎపిక్ అంటూ ఒక సినిమాగా రిలీజ్ చేస్తున్నారు. బాహుబలి రెండు సినిమాల ఎక్స్ పీరియన్స్ ని ఒకే సినిమాగా ఇవ్వబోతున్నారు.;
బాహుబలి రెండు భాగాలు కలిపి బాహుబలి ఎపిక్ అంటూ ఒక సినిమాగా రిలీజ్ చేస్తున్నారు. బాహుబలి రెండు సినిమాల ఎక్స్ పీరియన్స్ ని ఒకే సినిమాగా ఇవ్వబోతున్నారు. 10 ఏళ్ల తర్వాత కూడా బాహుబలి మీద ఆడియన్స్ లో ఉన్న బజ్ ని క్యాష్ చేసుకునేందుకు బాహుబలి ఎపిక్ వస్తుంది. ఈ నెల 31న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ని భారీగానే ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి. బాహుబలి ఎపిక్ కోసం ఇప్పటికే రాజమౌళి, ప్రభాస్, రానా ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు.
బాహుబలి ఎపిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్..
ఆ ఇంటర్వ్యూతోనే సినిమాపై ఎపిక్ రిలీజ్ పై బజ్ ఏర్పరిచారు. ఇక నెక్స్ట్ బాహుబలి ఎపిక్ కోసం మళ్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లాంటివి ప్లాన్ చేస్తున్నారట. ఐతే ఈ ఈవెంట్ లో ప్రభాస్, రానా తో పాటు మిగతా చిత్ర యూనిట్ కూడా పాల్గొంటారని తెలుస్తుంది. ఐతే బాహుబలి ఎపిక్ ఈవెంట్ కి అనుష్క వస్తుందా.. లేదా అన్న ప్రశ్న ఎదురైంది.
అనుష్క సినిమాల విషయంలో చాలా గ్యాప్ తీసుకుంటూ వస్తుంది. బాహుబలి 2 తర్వాత ఆమె కేవలం 3 సినిమాలు మాత్రమే చేసింది. సినిమా సినిమాకు అనుష్క గ్యాప్ తీసుకోవడం కామన్ అయ్యింది. ఐతే రీసెంట్ గా సెప్టెంబర్ లో అనుష్క నటించిన ఘాటి సినిమా రిలీజైంది. ఈ రిలీజ్ టైం లో అనుష్క ప్రమోషన్స్ లో పాల్గొనలేదు. అదేంటి సొంత సినిమా రిలీజ్ టైం లో బయటకు రాకపోవడం ఏంటని అందరు మాట్లాడారు.
ఘాటి ఈవెంట్ కి రాని అనుష్క బాహుబలి కోసం వస్తుందా..
అనుష్క కండీషన్స్ అప్లై అన్న తర్వాతే సినిమాలు చేస్తుందని తెలుస్తుంది. ఐతే బాహుబలి ఎపిక్ ఈవెంట్ కి అనుష్క వస్తుందని ప్రచారం జరుగుతుంది. ఘాటి ఈవెంట్ కి రాని అనుష్క బాహుబలి కోసం వస్తుందా అన్న డిస్కషన్ మొదలైంది. ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేయడంలో తప్పులేదు కానీ ఘాటి తన సోలో సినిమా. ఫిమేల్ సెంట్రిక్ సినిమాగా వచ్చిన ఆ సినిమా ప్రమోషన్స్ కి అనుష్క నో చెప్పింది. తను లీడ్ లో నటించిన ఘాటి సినిమాకు రాని అనుష్క బాహుబలి కోసం వస్తుందా అనే డౌట్ మొదలైంది.
అనుష్క వచ్చే ఛాన్స్ అసలు లేదు కానీ ఆమె గురించి మాత్రం సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. బాహుబలి ఎపిక్ రిలీజ్ అని అనౌన్స్ మెంట్ చేసిన దగ్గర నుంచి అనుష్క ఈమధ్య సోషల్ మీడియాలో కూడా కనిపించట్లేదు. ఘాటి రిలీజ్ తర్వాత సోషల్ మీడియాకు కొంతకాలం దూరంగా ఉంటానని అనౌన్స్ చేసింది అనుష్క. మరి రాజమౌళి అనుష్కని బాహుబలి ఎపిక్ ఈవెంట్ కి తీసుకొస్తాడా.. ప్రభాస్, రానాలతో అనుష్క ఈవెంట్ లో పాల్గొంటుందా అన్నది తెలియాల్సి ఉంది.